Butter Milk: ఏంటీ..? మజ్జిగతో జుట్టును జిగేల్‌మనిపించొచొచ్చా..? అని అవాక్కవుతున్నారా..? ఓ గ్లాసుడు మజ్జిగలో దీన్ని కలిపి..!
ABN , First Publish Date - 2023-06-15T13:36:08+05:30 IST
వేసవికాలంలో ఆరోగ్యం బాగుండాలన్నా, శరీరం డీహైడ్రేట్ అవ్వకూడదన్నా మజ్జిగ తాగితే మంచిదని అందరికీ తెలుసు. పలుచటి మజ్జిగ అతిదాహాన్ని నియంత్రించడంతో పాటు బోలెడు లాభాలు చేకూరుస్తుంది. కానీ మజ్జిగతో జుట్టును మెరిసిపోయేలా చేయొచ్చని మీకు తెలుసా? కేవలం జుట్టు మెరవడమే కాదు, నల్లగా ఒత్తుగా ఆరోగ్యంగా మారుతుంది. అయితే టేబుల్ స్పూన్ ఇదొక్కటి కలపాలి.
వేసవికాలంలో ఆరోగ్యం బాగుండాలన్నా, శరీరం డీహైడ్రేట్ అవ్వకూడదన్నా మజ్జిగ తాగితే మంచిదని అందరికీ తెలుసు. పలుచటి మజ్జిగ అతిదాహాన్ని నియంత్రించడంతో పాటు బోలెడు లాభాలు చేకూరుస్తుంది. కానీ మజ్జిగతో జుట్టును మెరిసిపోయేలా చేయొచ్చని మీకు తెలుసా? కేవలం జుట్టు మెరవడమే కాదు, నల్లగా ఒత్తుగా ఆరోగ్యంగా పెరుగుతుంది కూడా. అయితే ఒకే ఒక్క పదార్థం మజ్జిగలో కలపాలండోయ్. ఆ అద్బుతమైన పదార్థమేంటో.. దానివల్ల జుట్టుకు జరిగే మ్యాజిక్ ఏంటో పూర్తీగా తెలుసుకుంటే..
చర్మసంరక్షణ(skin care) గూర్చి అవగాహన ఉన్న ఏ మహిళకు అయినా ముల్తాని మట్టి(Multani mitti) గురించి తెలిసే ఉంటుంది. అయితే ముల్తాని మట్టిని కేవలం ముఖ సౌందర్యం కోసమే కాదు, కేశ సంరక్షణలో భాగంగా కూడా ఉపయోగిస్తారని తెలుసా?(Multani mitti using for hair) ముల్తాని మట్టిలో మెగ్నీషియం, క్వార్ట్జ్, సిలికా, ఐరన్ కాల్షియం, కాల్సైట్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి జుట్టు సంరక్షణకు ఎంతగానో సహాయపడతాయి. జుట్టు సంరక్షణ కోసం ముల్తాని మట్టి, మజ్జిగ హెయిర్ ప్యాక్ తయారుచేసుకుని వాడాలి. ఈ హెయిర్ ప్యాక్ ఎలా చేసుకోవాలంటే..
Bathing: రోజుకు రెండుసార్లు స్నానం చేస్తున్నా సరే.. అందరూ కామన్‌గా చేసే ఒకే ఒక్క మిస్టేక్ ఇదే.. తప్పు చేస్తున్నామని తెలియకుండానే..!
ఒక గిన్నెలో ఒక చెంచా ముల్తాని మట్టి తీసుకోవాలి(1tbsp multani mitti). ఇందులో ఒక కప్పు మజ్జిగ కలపాలి(one cup butter milk). ఇది ఏమాత్రం ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని 20నిమిషాల పాటు ఒకవైపు ఉంచాలి(rest it 20 minutes). ఈలోపు జుట్టుకు లైట్ గా కొబ్బరి నూనె రాయాలి(coconut oil). దీనివల్ల ముల్తాని మట్టిని వదిలించడం సులువు అవుతుంది. జుట్టుకు కొబ్బరినూనె రాసిన తరువాత 20నిమిషాలు అలాగే ఉంచిన మజ్జిగ, ముల్తాని మట్టి ప్యాక్ ను అప్లై చెయ్యాలి. జుట్టు కుదుళ్ళ నుండి మొదలుపెట్టి వెంట్రుకల చివరల దాకా బాగా అప్లై చేయాలి. ముల్తాని మట్టి ఎండిపోతే శుభ్రం చేయడం కష్టం కాబట్టి షవర్ క్యాప్ లేదా కవర్ తో కప్పి ఉంచాలి. గంట తరువాత గాఢత లేని షాంపూతో జుట్టును వాష్ చేసుకోవాలి. దీనివల్ల ఒత్తుగా, నల్లగా మెరిసిపోయే జుట్టు సొంతమవతుంది. పైపెచ్చు చుండ్రు సమస్య కూడా తగ్గిపోతుంది.