Cab Driver: ఓ చైనా క్యాబ్ డ్రైవర్ అహంకారం.. కూతురితో పాటు కారు ఎక్కిన ఆ మహిళను భారతీయురాలేనని భావించి..!

ABN , First Publish Date - 2023-09-26T20:02:14+05:30 IST

సింగపూర్‌లో(Singapore) పొట్టపోసుకుంటున్న ఓ చైనా క్యాబ్ డ్రైవర్ ఓ మహిళను భారతీయురాలిగా భావించి తన జాత్యాహకార విషం(Racisim) చిమ్మాడు. కన్నబిడ్డతో ఒంటరిగా ప్రయాణిస్తోందని కూడా చూడకుండా భారతీయులంతా ఇంతే అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడాడు.

Cab Driver: ఓ చైనా క్యాబ్ డ్రైవర్ అహంకారం.. కూతురితో పాటు కారు ఎక్కిన ఆ మహిళను భారతీయురాలేనని భావించి..!

ఇంటర్నెట్ డెస్క్: సింగపూర్‌లో(Singapore) పొట్టపోసుకునేందుకు వచ్చిన ఓ చైనా క్యాబ్ డ్రైవర్ ఓ మహిళను భారతీయురాలిగా భావించి తన జాత్యాహకార విషం చిమ్మాడు. కన్నబిడ్డతో ఒంటరిగా ప్రయాణిస్తోందని కూడా చూడకుండా భారతీయులంతా ఇంతే అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడాడు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు అతడిపై దర్యాప్తు ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే, సింగపూర్‌లో ఉంటున్న యూరేషియా(Eurasia) సంతతి మహిళ జానెల్ హోడెన్ (46) ఓ యాప్‌లో క్యాబ్‌ను బుక్ చేసుకుంది. ఆ తరువాత క్యాబ్ వచ్చాక తన కూతురితో(9) కలిసి కారులో ఎక్కింది. క్యాబ్ డ్రైవరేమో చైనా సంతతి వ్యక్తి. వారు కొంత దూరం వెళ్లాక ఎదురుగా రోడ్ బ్లాక్ కనిపించడంతో ముందుకెళ్లలేకపోయారు. దీంతో, తీవ్ర అసహనానికి లోనైనా క్యాబ్ డ్రైవర్ మహిళపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తప్పుడు డైరెక్షన్స్ చెప్పావంటూ ఆమెపై మండిపడ్డాడు(Cab driver in Singapore shouts at woman, child thinking they were indians).


‘‘నేను చైనా వాణ్ణి, నువ్వు భారతీయురాలివి. మీరు మూర్ఖులు..మరీ దారుణం’’ అంటూ తన జాత్యాహంకారాన్ని ప్రదర్శించాడు. అతడి తీరుపై మహిళ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తాను భారతీయురాలిని కాదని, యూరేషియా వ్యక్తినని చెబుతూనే ఎవరిపైనా జాత్యాహంకారం ప్రదర్శించరాదని అతడికి గట్టిగా బదులిచ్చింది. అంతేకాకుండా, అతడిని ఫోనులో రికార్డు చేయడం ప్రారంభించింది.

మరోవైపు, చైనా క్యాబ్ డ్రైవర్..మహిళ బిడ్డపై కూడా తన అసహనం వ్యక్తం చేశాడు. సింగపూర్ నిబంధనల ప్రకారం, 135 సెంటీమీటర్ల కంటే తక్కువ ఎత్తున్న చిన్నారుల కోసం క్యాబ్‌లలో ప్రత్యేకమైన బూస్టర్ సీట్లు అందుబాటులో ఉంచాలి. అయితే, బిడ్డ పొట్టిగా ఉందంటూ అతడు మహిళపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. బాలికను అక్రమంగా దేశంలోకి తీసుకొచ్చావంటూ నోరుపారేసుకున్నాడు.

ఆ తరువాత మహిళ క్యాబ్ సంస్థకు ఫిర్యాదు చేసింది. తను భారతీయురాలైనా కాకపోయినా క్యాబ్ డ్రైవర్ అలా తన జాత్యాహంకారం ప్రదర్శించడం సరికాదని మండిపడింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Updated Date - 2023-09-26T20:08:16+05:30 IST