Share News

Viral: కుక్కను తాకిన చేత్తో కళ్లు నులుముకున్న మహిళ.. ఆమె కళ్లను పరీక్షించి దిమ్మెరపోయిన వైద్యులు!

ABN , First Publish Date - 2023-12-10T18:58:30+05:30 IST

చైనా మహిళ కంట్లో పరుగులు చూసి డాక్టర్లకు కూడా షాకైపోయారు. ఆపరేషన్ చేసి వాటిని తొలగించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Viral: కుక్కను తాకిన చేత్తో కళ్లు నులుముకున్న మహిళ.. ఆమె కళ్లను పరీక్షించి దిమ్మెరపోయిన వైద్యులు!

ఇంటర్నెట్ డెస్క్: కళ్లు తెగ దురద పెట్టడంతో డాక్టర్ వద్దకు వెళ్లిందో మహిళ. ఆమె కళ్లను పరీక్షించిన డాక్టర్లే ఒక్కసారిగా షాకైపోయారు. చైనాలో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే, చైనాలోని కున్మింగ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళకు కొంత కాలంగా కళ్లల్లో దురద పెరుగుతుండటంతో వైద్యులను సంప్రదించింది.

ఆమె కళ్లను పరీక్షించిన డాక్టర్లను దిమ్మతిరిగినంత పనైంది (Doctors find worms in chinese woman's eyes). కళ్లల్లో వానపాముల్లాంటి చిన్న చిన్న పరుగులు ఉండటం చూసి వారు నోరెళ్లబెట్టారు. వెంటనే రంగంలోకి దిగి వాటిని ఆపరేషన్ చేసి తొలగించారు. కుడి కంట్లోంచి 40 పరుగులు, ఎడమ కంట్లోంచి మరికొన్ని పురుగులు తొలగించారు. మొత్తంగా 60కి పైగా పురుగులను బయటకు తీశారు. ఎంతో అనుభవం ఉన్న వైద్యులే మహిళ పరిస్థితి అర్థంకాక దిమ్మెరపోయారు.


మహిళ పరిస్థితి చాలా అసాధారణమని ఆమెకు శస్త్రచికిత్స చేసిన వైద్యుడు వ్యాఖ్యానించారు. అవి ఫైలోరిడేయీ జాతికి చెందిన రౌండ్ వార్మ్స్ అని చెప్పారు. దోములు, ఈగల్లాంటి కొన్ని రకాల పురుగుల కారణంగా ఇవి వ్యాపిస్తాయని తెలిపారు. అయితే, కుక్కలు లేదా పిల్లుల వల్ల తన కంట్లోకి ఇవి ప్రవేశించి ఉంటాయని బాధితురాలు అభిప్రాయపడింది. కుక్కను తాకిన వెంటనే కళ్లు నులుముకోవడంతో దాని చర్మంపై ఉన్న పురుగులు తన కంట్లోకి చేరి ఉంటాయని అభిప్రాయపడింది. ఇదిలా ఉంటే, మహిళ కంట్లో మరిన్ని పురుగులు మిగిలిపోయి ఉండొచ్చని భావించిన వైద్యులు మరోసారి చెక‌ప్‌కు రావాలని ఆమెకు సూచించారు.

Updated Date - 2023-12-10T19:05:40+05:30 IST