Viral Post: 5వ తరగతి చదువుతున్న నా కొడుకు రాసిన ఎగ్జామ్ పేపర్ ఇదీ.. అంటూ ఓ తండ్రి పోస్ట్.. నెటిజన్ల నుంచి అనూహ్య రెస్పాన్స్..!
ABN , First Publish Date - 2023-03-17T15:03:57+05:30 IST
బ్రిటీష్ వారు భారతదేశానికి రాక పూర్వం ఎన్నో సాంఘిక దురాచారాలు రాజ్యమేలుతుండేవి. మూఢ నమ్మకాలు, ఛాందసత్వం వల్ల ఎంతో మంది అమాయకులు, ముఖ్యంగా స్త్రీలు ఇబ్బందులు పడేవారు.
బ్రిటీష్ వారు భారతదేశానికి (India) రాక పూర్వం ఎన్నో సాంఘిక దురాచారాలు రాజ్యమేలుతుండేవి. మూఢ నమ్మకాలు, ఛాందసత్వం వల్ల ఎంతో మంది అమాయకులు, ముఖ్యంగా స్త్రీలు ఇబ్బందులు పడేవారు. సతీ సహగమనం, బాల్య వివాహాలు వంటి దురాచారాల మహిళలపై కత్తుల్లా వేలాడేవి. ఆ తర్వాత పలువురు సంఘసంస్కర్తలు వాటిని రూపుమాపడానికి ఎన్నో పోరాటాలు చేశారు. తాజాగా ఓ ఐదో తరగతి కుర్రాడికి పరీక్షలో అదే ప్రశ్న ఎదురైంది (Class 5 student Answer sheet went Viral).
``ఒకవేళ నీవు స్వాతంత్య్రానికి ముందు (pre-independence) ఓ సంఘ సంస్కర్తవు అయి ఉంటే.. అప్పుడు ఉన్న సాంఘిక దురాచారాలలో దేనిని రూపుమాపడానికి ప్రయత్నించేవాడివి? ఎందుకు?`` అనే ప్రశ్న ఎదురైంది. దానికి ఆ కుర్రాడు రాసిన జవాబు.. ``నేను అప్పుడు ఉండి ఉంటే వితంతు పునర్వివాహ చట్టాన్ని (Widows Remarriage Act) రూపొందించేవాడిని. ఎందుకంటే ఒక మహిళ తన భర్తను కోల్పోతే.. ఆమె సతి పాటించాలి లేదా తెల్ల చీర ధరించి, జట్టు ముడి వేసుకుని ఇంట్లో కూర్చోవాలి. వితంతువులకు మళ్లీ వివాహం జరిగితే వారు చాలా సంతోషంగా, ఆనందంగా జీవిస్తార``ని రాశాడు. ఆ కుర్రాడు రాసిన ఎగ్జామ్ పేపర్‌ను అతడి తండ్రి ట్విటర్‌లో పోస్ట్ చేశాడు.
Shocking: స్మార్ట్‌ఫోన్ కోసం బాలికను అమ్మేసిన బాలుడు.. ఆ బాలికను కొన్న వారు ఎంత దారుణానికి పాల్పడ్డారంటే..
ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ కుర్రాడి జవాబును మెచ్చుకున్న టీచర్ వెరీ గుడ్
అని కూడా రాశారు. ఆ పోస్ట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఆ కుర్రాడు చాలా దయగలవాడని, చాలా మంచి మనసు ఉన్నవాడని, కచ్చితంగా ఆ జవాబు పుస్తకంలో ఉండి ఉండదని కామెంట్లు చేస్తున్నారు.