Emergency Alert: నిన్న మధ్యాహ్నం సమయంలో మీ ఫోన్‌కు కూడా ఇలాంటి మెసేజ్ వచ్చిందా..? దీని అర్థమేంటంటే..!

ABN , First Publish Date - 2023-08-18T16:02:45+05:30 IST

ఆగస్టు 17, గురువారం మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో చాలా మంది ఆండ్రాయిడ్ యూజర్లకు ఎమర్జెన్సీ అలర్ట్ పేరుతో ఓ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూడగానే చాలా మంది ఆందోళనకు గురయ్యారు. ఏం జరగబోతోందో అని భయపడ్డారు. మీకూ అలాంటి మెసేజ్ వచ్చిందా?

Emergency Alert: నిన్న మధ్యాహ్నం సమయంలో మీ ఫోన్‌కు కూడా ఇలాంటి మెసేజ్ వచ్చిందా..? దీని అర్థమేంటంటే..!

ఆగస్టు 17, గురువారం మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో చాలా మంది ఆండ్రాయిడ్ యూజర్లకు ఎమర్జెన్సీ అలర్ట్ (Emergency Alert) పేరుతో ఓ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూడగానే చాలా మంది ఆందోళనకు గురయ్యారు. ఏం జరగబోతోందో అని భయపడ్డారు. మీకూ అలాంటి మెసేజ్ వచ్చిందా? అయితే ఆ మెసేజ్ గురించి ఆందోళన చెందకండి. దేశంలోని ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్‌ను పరీక్షించేందుకు ఈ మెసేజ్ పంపినట్లు టెలికాం శాఖ (Telecom Department) ఓ వివరణ ఇచ్చింది.

మొబైల్ ఆపరేటర్లు, సెల్ బ్రాడ్ కాస్టింగ్ సిస్టమ్ కలిసి ఎమర్జెన్సీ అలర్ట్ ట్రాన్స్‌మిషన్ పనితీరును అంచనా వేయడానికి వివిధ ప్రాంతాలలో ఇటువంటి టెస్టింగ్ ఎప్పటికప్పుడు నిర్వహిస్తుంటాయని టెలికమ్యూనికేషన్స్ విభాగం తెలిపింది. ప్రజల భద్రతను మెరుగుపర్చడానికి, అత్యవసర సమయంలో సకాలంలో హెచ్చరికలను అందించడం కోసం ఈ ఎమర్జెన్సీ అలర్ట్‌లను ఉపయోగిస్తారు. ఆ సిస్టమ్ సరిగ్గా పని చేస్తోందా? లేదా? అని గురువారం పరీక్షించారు.

Viral Video: మనసుకు ఆహ్లాదం కలిగించే వీడియో.. బిడ్డకు తొలి అడుగులు నేర్పుతున్న తల్లి ఏనుగు.. వీడియో వైరల్!

భూకంపాలు (Earthquakes), సునామీలు (Tsunamis), ఆకస్మిక వరదలు వంటి విపత్తులు తలెత్తిన సమయంలో మెరుగైన సన్నద్ధత కోసం జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (National Disaster Management), సెల్ బ్రాడ్ కాస్టింగ్ సిస్టమ్‌తో కలిసి పనిచేస్తోంది. ఇలాంటి ఎమర్జెన్సీ అలర్ట్‌‌లు వచ్చినప్పుడు పాప్-అప్ రూపంలో ఓ నోటిఫికేషన్ వస్తుంది. 30 సెకెండ్ల పాటు ఆ మెసేజ్ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది.

Updated Date - 2023-08-18T16:02:45+05:30 IST