Share News

Dirty Neck: మెడ దగ్గర నల్లగా అసలు ఎందుకు అవుతుంది..? మళ్లీ మామూలుగా అక్కడ చర్మం మారిపోవాలంటే..!

ABN , First Publish Date - 2023-11-03T14:12:25+05:30 IST

ఎంత అందంగా తయారైనా మెడవెనుక నలుపు ఉంటే అసహ్యాంగా కనిపిస్తుంది. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే మెడ నలుపు చాలా ఈజీగా వదిలించుకోవచ్చు..

Dirty Neck: మెడ దగ్గర నల్లగా అసలు ఎందుకు అవుతుంది..? మళ్లీ మామూలుగా అక్కడ చర్మం మారిపోవాలంటే..!

చాలామందిలో మెడ దగ్గర చర్మం నల్లగా కనిపిస్తుంది. మెడ భాగంలో శుభ్రత పాటించకపోవడం, ఆభరణాల ప్రతిచర్య వల్ల, విపరీతమైన చెమట మొదలైన కారణాల వల్ల మెడ భాగంలో చర్మం నల్లగా తయారవుతుంది. దీని కారణంగా ఎవరిముందుకైనా వెళ్లాలంటే ఎబ్బెట్టుగా ఉంటుంది. ఎంత అందంగా తయారైనా మెడవెనుక నలుపు ఉంటే అసహ్యాంగా కనిపిస్తుంది. దీన్ని తొలగించుకోవడానికి ఎన్నెన్నో టిప్స్ ఫాలో అవుతూంటారు. మార్కెట్లో ఎన్నో ఉత్పత్తులు కూడా కొనుగోలు చేస్తారు. కానీ మెడ నలుపు వదిలించడానికి కొబ్బరి నూనె బాగా ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనెలో ఈ కింద చెప్పుకునే పదార్థాలు కలిపి నల్లగా ఉన్న చర్మం మీద రాస్తుంటే చర్మం తిరిగి సాధారణ రంగులోకి వస్తుంది(dark neck reduce tips). అవేంటో తెలుసుకుంటే..

కొబ్బరి నూనె,టూత్ పేస్ట్..(coconut oil, tooth paste)

మెడ నలుపు తొలగించుకోవడానికి కొబ్బరి నూనె, టూత్ పేస్ట్ చక్కని ఫలితాలు ఇస్తుంది. కొబ్బరనూనెలో ఒక స్పూన్ టూత్ పేస్ట్, అర టీ స్పూన్ ఉప్పు కలపాలి. ఈ మిశ్రమాన్ని నల్లగా ఉన్న మెడ చర్మానికి పట్టించి కొద్దిసేపు అలాగే వదిలేయాలి. కొంతసమయం తరువాత కట్ చేసిన నిమ్మకాయ ముక్కను తీసుకుని మెడపై సున్నితంగా రుద్దాలి. 10నిమిషాలపాటు ఇలా రుద్దిన తరువాత శుభ్రమైన నీటితో మెడను శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండుసార్లుఈ పని చేస్తుంటే చక్కని ఫలితం ఉంటుంది.

Read Also: Smoking: పొద్దున్నే సిగరెట్ తాగే అలవాటుందా..? ఈ దారుణ నిజాలు తెలిస్తే అసలు లైటర్ కూడా వెలిగించరేమో..!



కొబ్బరి నూనె,కలబంద..(coconut oil, aloe vera)

కలబందలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెడ నలుపు వదిలించడంలో సహాయపడతాయి. కొబ్బరినూనెలో అలోవెరా జెల్ వేసి బాగా మిక్స్ చేయాలి. దీన్ని మెడకు పట్టించి 10నిమిషాల సేపు మసాజ్ చేయాలి. ఆ తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

కొబ్బరి నూనె, కాఫీ పౌడర్..(coconut oil, coffee powder)

ఈ మధ్యకాలంలో చర్మసంరక్షణలో కాఫీ పౌడర్ విరివిగా ఉపయోగిస్తున్నారు. చర్మం మీద మురికిని తొలగించి చర్మాన్ని కాంతివంతంగా ఉంచడంలో కాఫీ పౌడర్ బాగా సహాయపడుతుంది. కొబ్బరినూనెలో కాఫీ పౌడర్ వేసి స్క్రబ్ లాగా తయారుచేయాలి. దీన్ని దీన్ని 5-10నిమిషాల సేపు మెడభాగంలో అప్లై చేసి స్క్రబ్ చేయాలి. ఆ తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

కొబ్బరి నూనె, నిమ్మరసం..(coconut oil, lemon juice)

నిమ్మకాయ సహజమైన బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. కొబ్బరినూనెలో నిమ్మకాయ రసం కలిపి మెడ భాగంలో అప్లై చేయాలి. 10నుండి 15నిమిషాల పాటు బాగా మసాజ్ చేసి ఆ తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. దీన్ని ప్రతిరోజూ వాడచ్చు. చాలా తొందరగా ఫలితాలు కనిపిస్తాయి.

Read Also: Dengue: ఏ ఆస్పత్రిలో చూసినా డెంగ్యూ రోగులే.. డాక్టర్లు ఇచ్చే మెడిసిన్సే కాదండోయ్.. ఈ వంటింటి చిట్కాలూ డెంగ్యూను తగ్గిస్తాయ్..!


Updated Date - 2023-11-03T14:12:27+05:30 IST