Viral: వధువుకు దారుణ అనుభవం.. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునేందుకు వరుడితో కలిసి వెళితే..
ABN , First Publish Date - 2023-10-19T16:41:53+05:30 IST
ప్రభుత్వాఫీసుల్లో తమ గోడు వినిపించుకునే వారే కరువయ్యారంటూ అనేక మంది ఫిర్యాదు చేయడం మనం చూస్తూనే ఉంటాం. కనీనం దివ్యాంగుల విషయంలోనైనా అధికారులు కాస్తంత జాలి దయా చూపిస్తే బాగుండని ఆశిస్తాం. ఇలాగే ఆశించిన చివరకు భంగపడిన ఓ వధువు ఉదంతం ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వాఫీసుల్లో తమ గోడు వినిపించుకునే వారే కరువయ్యారంటూ అనేక మంది ఫిర్యాదు చేయడం మనం చూస్తూనే ఉంటాం. కనీనం దివ్యాంగుల విషయంలోనైనా అధికారులు కాస్తంత జాలి దయా చూపిస్తే బాగుండని ఆశిస్తాం. ఇలాగే ఆశించి చివరకు భంగపడిన ఓ వధువు(Disable bride) ఉదంతం ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా(Viral) మారింది. పెళ్లి చేసుకునేందుకు రిజిస్టర్ కార్యాలయానికి వెళ్లిన ఆమెకు ఎదురైన దారుణ అనుభవం ఏకంగా మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రినే కదిలించింది(Disabled Mumbai bride carried up 2 floors at Registrar Office, Devendra Fadnavis apologises).
Viral: Viral: ఇలాంటి కోతి భూప్రపంచంలో మరోటి ఉండదేమో? తాసీల్దార్ ఆఫీసులోకి ఫైళ్లు కనిపించగానే..
తనకు ఎదురైన దారుణ అనుభవాన్ని గురించి వివరిస్తూ విరాలి మోదీ అనే మహిళ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. తను ఎదుర్కొన్న పరిస్థితిని ఎక్స్ వేదికగా ఆమె కళ్లకుకట్టినట్టు వర్ణించింది. ‘‘నేను చక్రాల కుర్చీకే పరిమితమయ్యాను. అక్టోబర్ 16న ఖార్ ముంబైలోని రిజిస్టర్ కార్యాలయంలో నా పెళ్లి జరిగింది. ఆఫీసేమో రెండో అంతస్తులో ఉంది. అక్కడ కనీసం లిఫ్ట్ కూడా లేదు. మెట్లేమో అన్నీ తుప్పు పట్టి ఉన్నాయి. రెయింగ్ కూడా అటూ ఇటూ కదులుతూ భయంగొలిపేలా ఉంది. రిజిస్టర్ ఆఫీసులో అపాయింట్‌మెంట్ తీసుకోకమునుపే నా సమస్యను వివరించా’’.
Viral: ఇలాంటి కోతి భూప్రపంచంలో మరోటి ఉండదేమో? తాసీల్దార్ ఆఫీసులోకి ఫైళ్లు కనిపించగానే..
‘‘కానీ ఆ రోజు నాకు సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. నా సంతకాలు తీసుకునేందుకు సిబ్బందిని కిందకు రమ్మని పిలిచినా వారు రాలేదు. చివరకు నన్ను చక్రాల కుర్చితో సహా రెండవ అంతస్తుకు తీసుకెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో నేను కింద పడి ఉంటే నా పరిస్థితి ఏమై ఉండేది. నాలాంటి వారి కోసం ఈ దేశం, ప్రజలు పట్టించుకోరని తెలిసి నా గుండె పగిలింది. మానవత్వంపై నా నమ్మకం తుడిచిపెట్టుకుపోయింది. రెండో అంతస్తుకు మోసుకుని తీసుకెళ్లడానికి నేనేమీ లగేజీని కాదు. నేనూ మనిషినే..నాకు కొన్ని హక్కులు ఉంటాయి. అంటూ ఆమె ఘాటు పదాలతో తన ఆవేదన వెళ్లబోసుకుంది.
Viral: రోడ్డుపై అడ్డంగా పాము..దాని పడగకు తగిలేలా తూపాకీతో కాల్చిన వ్యక్తి.. గురి తప్పడంతో..
విరాలీ పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. పెళ్లి చేసుకున్నందుకు ఆమెకు శుభాకాంక్షలు చెబుతూనే ఆమెకు ఎదురైన కష్టానికి విచారం వ్యక్తం చేశారు. విషయం చివరకు ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis) వరకూ వెళ్లడంతో ఆయన సోషల్ మీడియా వేదికగా మహిళకు క్షమాపణలు చెప్పారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు తగు దిద్దుబాటు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.