Cadbury Dairy Milk: డైరీ మిల్క్ చాక్లెట్స్ కవర్ల కలర్ వెనుక ఇంత కథ జరిగిందా..? పోటీగా మరో కంపెనీ కేసు వేస్తే..!
ABN , First Publish Date - 2023-05-19T15:49:40+05:30 IST
చిన్న వయసు పిల్లలందరూ చాక్లెట్లు, క్యాండీలని విపరీతంగా ఇష్టపడతారు. వాటి కోసం పెద్దలు చెప్పిన పనులను సైతం చేసేస్తుంటారు. చిన్న పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చాక్లెట్లలో డైరీ మిల్క్ ఒకటి.
చిన్న వయసు పిల్లలందరూ చాక్లెట్లు (chocolates), క్యాండీలని విపరీతంగా ఇష్టపడతారు. వాటి కోసం పెద్దలు చెప్పిన పనులను సైతం చేసేస్తుంటారు. చిన్న పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చాక్లెట్లలో డైరీ మిల్క్ (Dairy Milk) ఒకటి. పిల్లలను ఆకట్టుకునేందుకు ఆ సంస్థ చాలా ఆకర్షణీయంగా ప్యాకింగ్ చేస్తుంది. అందుకే చాలా మంది పిల్లలు ఆ చాక్లెట్లను తీసుకుంటుంటారు. ఆ ప్యాకింగ్ వెనుక ఓ ఆసక్తికరమైన నిజం ఉందట.
డైరీ మిల్క్ చాక్లెట్లను క్యాడ్‌బరీ (Cadbury) సంస్థ తయారు చేస్తుంది. క్యాడ్‌బరీ బ్రాండ్‌ను 1831లో జాన్ క్యాడ్‌బరీ అనే వ్యక్తి ప్రారంభించారు. క్యాడ్‌బరీ బ్రాండ్ కింద డైరీ మిల్క్ చాక్లెట్‌ను మొదటిసారిగా 1905లో విక్రయించారు. 1914 నుంచి క్యాడ్‌బరీ కంపెనీ తన ఉత్పత్తులకు ఊదా రంగు (Purple Colour)ను ఉపయోగిస్తోంది. క్వీన్ విక్టోరియా (Queen Victoria)కు ఉదా రంగు అంటే ఎంతో ఇష్టం. ఆమెకు నివాళిగా ఊదా రంగులో డైరీ మిల్క్ చాక్లెట్ కవర్‌ను తయారు చేశారు.
Weird News: గుండెపోటుతో చనిపోయిన అన్న.. మీకు నేనున్నానంటూ ముగ్గురు పిల్లల తల్లయిన వదినను పెళ్లి చేసుకున్న మరిది..!
1920 నుంచి క్యాడ్బరీ సంస్థ తమ చాక్లెట్ ఉత్పత్తుల ప్యాకెజింగ్‌కు బంగారు, పర్పుల్ కలర్‌లు వాడుతోంది. ఈ పర్పుల్ కలర్ విషయంలో మరో చాక్లెట్ కంపెనీ అయిన నెస్లేతో (Nestle) డెయిరీ మిల్క్‌కు వివాదం చెలరేగింది. కోర్టుకు కూడా వెళ్లారు. పాంటోన్ 2865c రంగును ట్రేడ్‌మార్క్ చేయాలని 2004లో క్యాడ్‌బరీ విజ్ఞప్తి చేసింది. అలా చేయకూడదని నెస్లే వ్యతిరేకించింది. నెస్లే అప్పీల్‌ను 2012లో కోర్టు తిరస్కరించింది.