Share News

Musk: మనకు తెలీకుండానే అటువైపు అడుగులు పడుతున్నాయి..ఎలాన్ మస్క్ వార్నింగ్

ABN , First Publish Date - 2023-10-24T22:58:31+05:30 IST

ప్రస్తుతం నెలకొన్న భౌగోళికరాజకీయ ఉద్రిక్తలపై టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

Musk: మనకు తెలీకుండానే అటువైపు అడుగులు పడుతున్నాయి..ఎలాన్ మస్క్ వార్నింగ్

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం నెలకొన్న భౌగోళికరాజకీయ ఉద్రిక్తలపై టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్-హమాస్(Israel-Hamas) యుద్ధం కారణంగా అమెరికా తనకు తెలీకుండానే మూడో ప్రపంచ యుద్ధం(World War 3) దిశగా అడుగులు వేస్తోందని హెచ్చరించారు. యావత్ మానవాళికి ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు. రష్యాతో(Russia) సంబంధాలు పునరుద్ధరించేందుకు, ఉక్రెయిన్‌లో(Ukraine) శాంతి నెలకొల్పేందుకు అమెరికా పరిష్కారం కనిపెట్టాలని సూచించారు.

Viral: సహోద్యోగిని కాక్‌పిట్‌లోకి అనుమతించిన పైలట్‌లకు షాకింగ్ అనుభవం.. విమానం గాల్లో ఉండగా..

USA: ఎల్-1 వీసాలకు వాళ్లు అర్హులు కాదు.. క్లారిటీ ఇచ్చిన అమెరికా

డేవిడ్ సాక్స్ నేతృత్వంలో ట్విట్టర్ స్పేస్‌లో నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుత యుద్ధాల కారణంగా మానవ సమాజమే ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రాంతీయ ఘర్షణలు ప్రపంచ యుద్ధాలుగా మారకుండా అడ్డుకోవడంలో అమెరికా విదేశాంగ విధానం కీలక పాత్ర పోషించాలని అభిప్రాయపడ్డారు. పరిస్థితి ముదిరితే భారీ యుద్ధం చెలరేగుతుందని హెచ్చరించారు.

Canada Visa: కెనడా వెళ్లాలనుకుంటున్న వారికి గుడ్ న్యూస్!

Viral: గర్ల్‌ఫ్రెండ్‌కు తెలీకుండానే ఆమె కడుపు తీసేసిన డాక్టర్.. తల్లికాబోతున్నానని ఆమె చెప్పాక పక్కా ప్లాన్ వేసి..


రష్యా, చైనా(China) బంధంపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అపార ఖనిజ వనరులు ఉన్న రష్యా, అద్భుత పారిశ్రామిక సామర్థ్యం ఉన్న చైనా మధ్య ద్రుఢమైన బంధం అమెరికాకు సవాలుగా మారొచ్చని పేర్కొన్నారు. చైనా, ఇరాన్‌కు రష్యా మరింత చేరువయ్యే చర్యలకు అమెరికా దూరంగా ఉండాలని హెచ్చరించారు. ఇందుకు బదులుగా రష్యాతో ఉక్రెయిన్‌కు స్నేహం కుదిరేలా ప్రయత్నాలు చేయాలని చెప్పారు. రష్యా, ఇరాన్, చైనా కూటమికి అసాధారణ సామర్థ్యం ఉంటుందని, ఆర్థికంగా, పారిశ్రామికంగా పాశ్చాత్య కూటములకు సవాలు విసరగలదని చెప్పారు. యుద్ధ సమయాల్లో ఆర్థికశక్తి, పారిశ్రామిక సామర్థ్యమే కీలకంగా మారతాయని వివరించారు. అమెరికా రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామితో కలిసి మస్క్ ఈ చర్చలో పాల్గొన్నారు.

Viral: తొలిసారి చీర కొనుక్కునేందుకు వెళ్లిన నార్వే రాయబారి.. అక్కడి సీన్ చూసి..

Viral video: నల్లా నుంచి నీరు లోప్రెజర్‌తో వస్తోందని ఇతడేం చేశాడో తెలిస్తే..

Updated Date - 2023-10-24T22:58:53+05:30 IST