Female to Male Surgery: బిడ్డకు జన్మనివ్వబోతున్న ట్రాన్స్ మన్.. దేశంలోనే తొలిసారి..!

ABN , First Publish Date - 2023-02-04T11:09:56+05:30 IST

సోషల్ మీడియాలో చెప్పగానే ఆ వార్త అందరినీ కాసేపు అయోమయంలో పడేసింది.

Female to Male Surgery: బిడ్డకు జన్మనివ్వబోతున్న ట్రాన్స్ మన్.. దేశంలోనే తొలిసారి..!
Trans Men

కాలం ఎంత వేగంగా మార్పు చెందుతున్నా ఇంకా మనిషి ఆలోచనలో మార్పు రాలేదు. కుల, మతాలతో ప్రాంతీయ వాదాలతో కొట్లాడుకునే వారికి లింగ బేధాలు కూడా సమస్యే.. ఇక లింగమార్పిడితో జీవితాన్ని సవాలుగా తీసుకునేవారివి అడుగడుగునా శాపగ్రస్థ జీవితాలే. ఏ అవకాశాలు లేని, కుదరని స్థితిలో లింగబేధాల, హెచ్చుతగ్గులతో, అవమానాలతో రోజూ నరకాన్ని చూసే జీవితాలు. దీనిని ఎదిరిస్తూ దైర్యంగా కలిసి బ్రతకాలనే నిర్ణయం తీసుకోవాలంటే, సవాలుగా జీవించాలంటే చాలా సత్తా కావాలి. అలాంటి వారి జీవితాలు, వెలుగులోకివస్తే ఇదిగో ఇలా అందరినీ ఆశ్చర్యపరిచే ట్రాన్స్ జెండర్ జంట దేశంలోనే తొలిసారి తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్తగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కథనంలోకి వెళితే..

ట్రాన్స్ జెండర్ జంట తల్లిదండ్రులు కాబోతున్నారా? ఇది నిజంగా నిజమే.. వార్తలోకి వెళ్ళి కుతూహలంగా చదివి విషయాన్ని తెలుసుకోకుండా ఉంటామా..? కేరళకు చెందిన జియా, జహద్ ఇద్దరూ మార్చిలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. జియా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో చెప్పగానే ఆ వార్త అందరినీ కాసేపు అయోమయంలో పడేసింది.

వీళ్ళిద్దరూ మూడేళ్ళుగా కలిసి జీవిస్తున్నారు. పుట్టుకతోనే మగవాడైన జియా, లింగమార్పిడి చేయించుకుని అమ్మాయిగా మారాలని నిర్ణయించుకున్నాడు. ఇక అమ్మయిగా పుట్టిన జహద్ కూడా లింగ మార్పిడితో అబ్బాయిగా మారాలని అనుకుంది. అయితే ఈ వింత కథ వాళ్ళ రాతను స్వయంగా రాసుకుందామని నిర్ణయించుకునేలోపే, దైవం మరో కొత్త కథను మొదలు పెట్టింది. పుట్టుకతో అమ్మయి కాకపోయినా బిడ్డకు అమ్మ అనిపించుకోవాలనే కోరిక ఉండేదని, అది ఇలా అనుకోకుండా నెరవేరిందని ఆనందంగా చెపుతుంది జహద్. జియా కూడా తండ్రిగా పిలిపించుకోవడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాడని చెప్పుకొచ్చింది.

tt.jpg

ఈ లింగమార్పిడి చికిత్సను ఇంగ్లీష్లో సెక్స్ రీఎసైన్ మెంచ్ సర్జరీ (Sex reassignment mench surgery) అంటారు. లైంగిక అవయవాలు లైంగికత వేర్వేరుగా ఉన్న వారిని ట్రాన్స్ జెండర్లు అంటారు. ఈ చికిత్స చేయించుకునే వ్యక్తులకు కనీసం 20 ఏళ్ళ వయసు ఉండాలి. అయితే లింగ మార్పిడి చేయించుకోవాలని జియా, జహద్ నిర్ణయించుకోగానే జహద్ గర్భం దాల్చిన విషయం తెలీడంతో ఆపరేషన్ నిలిపి వేశారు. దేశంలోనే గర్భం దాల్చిన తొలి ట్రాన్స్ మన్ గా జహద్ వార్తల్లో నిలిచింది.

తాము చికిత్స తరువాత ట్రాన్స్ జెండర్స్ గా మారితే పిల్లలు కలగరనే విషయంగా, ఎవరైనా బిడ్డను దత్తత తీసుకోవాలని దత్తత కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ దత్తత వారిద్దరికీ సవాల్ గా మారింది. అందుకే బయోలాజికల్ గా జహద్ ఇంకా అమ్మాయే కావడంతో సాధారణ బిడ్డకు జన్మనిచ్చే అవకాశముందని, అబ్బాయిగా మారాలనుకున్న జహద్ ఆలోచనను జియా తాత్కాలికంగా వాయిదా వేయించింది.

అయితే ఇక్కడో ముఖ్యమైన సంగతి చెప్పుకోవాలి. లింగమార్పిడి శస్త్రచికిత్సలో భాగంగా జహద్ వక్షోజాలను ఇప్పటికే తొలగించడంతో పుట్టబోయే పసికందుకు దాతల సాయంతో పాలు అందివ్వాలని ఆలోచిస్తుంది ఈ జంట. ట్రాన్స్ జెండర్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు కనుక పుట్టబోయే బిడ్డకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాధారణ ప్రసవం జరుగుతుందని వైద్యులు తెలిపారు.

Updated Date - 2023-02-04T11:46:37+05:30 IST