Share News

Viral: రెండేళ్ల క్రితం ఉద్యోగం పోవడంతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన పైలట్..ఇప్పుడు ఎలా ఉన్నాడంటే..

ABN , First Publish Date - 2023-10-22T16:49:49+05:30 IST

రెండేళ్ల క్రితం ఉద్యోగం పోగొట్టుకున్న ఓ పైలట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ప్రస్తుతం రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఇతడి ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Viral: రెండేళ్ల క్రితం ఉద్యోగం పోవడంతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన పైలట్..ఇప్పుడు ఎలా ఉన్నాడంటే..

ఇంటర్నెట్ డెస్క్: యూట్యూబ్ వచ్చాక అనేక మందికి కంటెంట్ క్రియేషన్ ఓ ప్రధాన ఆదాయ వనరుగా మారిందన్న విషయం తెలిసిందే. ఎంతో మంది తమ ఉద్యోగాలు మానుకుని మరీ యూట్యూబ్ వైపు మళ్లుతున్నారు. రెండేళ్ల క్రితం ఓ పైలట్ అనుకోని పరిస్థితుల్లో ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ఆ తరువాత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం తాను ఏ స్థాయిలో ఉన్నదీ చెబుతూ ఓ ట్యూబ్ ఛానల్‌కు తాజాగా అతడిచ్చిన ఇంటర్వ్యూ నెట్టింట వైరల్‌గా మారింది. ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన ఈ మాజీ పైలట్ పేరు గౌరవ్ తనేజా(Gaurav Taneja).

వాస్తవానికి గౌరవ్ తనేజా అనేక మంది భారతీయులకు చిరపరితమైన పేరే! ఆయన యూట్యూబ్ ఛానల్‌ ‘ఫ్లైయింగ్ బీస్ట్’(Flying Beast) నెట్టింట బాగా పాప్యులర్. ఆ ఛానల్‌కు 86 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. స్వయంగా బాడీ బిల్డర్ అయిన తనేజా.. ‘ఫిట్ మజల్ టీవీ’, ‘రస్‌భరీ కే పాపా’ పేరిట మరో రెండు యూట్యూబ్ ఛానల్స్‌నూ నిర్వహిస్తున్నాడు. కంటెంట్ క్రియేషన్‌కే తన పూర్తి సమయం కేటాయించిన గౌరవ్ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ‘‘భయ్యా.. నన్ను ఏ కంపెనీ అయితే తొలగించిందో ఆ కంపెనీ సీఈఓ కంటే నేను ఎక్కువ సంపాదిస్తున్నాను’’ అని ఓ ఇంటర్వ్యూలో తాజాగా చెప్పుకొచ్చాడు.

H-1b visa: హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌లో భారీ మార్పులు ప్రతిపాదించిన అమెరికా!

Viral video: నల్లా నుంచి నీరు లోప్రెజర్‌తో వస్తోందని ఇతడేం చేశాడో తెలిస్తే..

2.jpg


గతంలో తనేజా ఎయిర్ఏషియాలో(Air Asia) పనిచేశాడు. ఆ సంస్థలో జరుగుతున్న నిబంధనల ఉల్లంఘనలను బయటపెట్టినందుకు తాను ఉద్యోగం పోగొట్టుకున్నట్టు చెప్పుకొచ్చాడు. ల్యాండింగ్ సమయంలో ఇంధన పొదుకు కోసం సంస్థ పైలట్లకు ఓ పద్ధతిని సూచించిందని, అది ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేస్తుందని తాను బయటపెట్టినట్టు చెప్పుకొచ్చాడు. అప్పటికే వ్లాగర్ అయిన తనేజా పైలట్ ఉద్యోగం పోయాక పూర్తిస్థాయి కంటెంట్ క్రియేటర్‌గా అవతారం ఎత్తాడు.

Mumbai: 17 ఏళ్ల పాటు నమ్మకంగా పనిచేసిన డ్రైవర్ ఒడిగట్టిన దారుణమిది! ఓనర్ ఆ సీక్రెట్ చెప్పగానే..

ప్రస్తుతం యూట్యూబ్‌లో వచ్చే యాడ్ రెవెన్యూ, ఎండార్స్‌మెంట్లే తన ప్రధాన ఆదాయ వనరులని గౌరవ్ తనేజా పేర్కొన్నాడు. పైలట్‌గా ఉన్నప్పుడు తాను నెలకు కేవలం రూ.60 వేలు మాత్రమే సంపాదించేవాడినని తెలిపాడు. ప్రస్తుతం ఈ ఉదంతం నెట్టింట వైరల్‌గా మారింది.

Canada Visa: ముదిరిన దౌత్య వివాదం.. భారతీయ విద్యార్థులకు భారీ షాకిచ్చిన కెనడా!

Updated Date - 2023-10-22T16:53:17+05:30 IST