Gold Price: తులం బంగారం రూ.10 వేలు మాత్రమే.. 2006వ సంవత్సరంలో ధర ఇదీ.. నేడు ఏకంగా రూ.60 వేలకు ఎందుకు చేరిందంటే..

ABN , First Publish Date - 2023-03-22T17:37:55+05:30 IST

ప్రస్తుతం అమెరికాలోనూ, యూరప్‌లోనూ బ్యాంక్‌లు దివాళా తీస్తుండడం ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తిస్తోంది. అన్ని దేశాల స్టాక్ మార్కెట్లూ అనిశ్చితిలో పడి కిందకు దిగి వస్తున్నాయి.

Gold Price: తులం బంగారం రూ.10 వేలు మాత్రమే.. 2006వ సంవత్సరంలో ధర ఇదీ.. నేడు ఏకంగా రూ.60 వేలకు ఎందుకు చేరిందంటే..

ప్రస్తుతం అమెరికాలోనూ (America), యూరప్‌లోనూ (Europe) బ్యాంక్‌లు (Banks) దివాళా తీస్తుండడం ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తిస్తోంది. అన్ని దేశాల స్టాక్ మార్కెట్లూ (Stock Markets) అనిశ్చితిలో పడి కిందకు దిగి వస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు (Gold Price) పైకి దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా భారత్‌లో (India) బంగారం ధరలకు రెక్కలు వస్తున్నాయి. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.60,410గా ఉంది. ఆర్థిక సంక్షభం తలెత్తినపుడు భారతీయుల్లో చాలా మంది బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు ఇష్టపడుతుంటారు.

గత 17 ఏళ్లలో బంగారం ధరలు ఏకంగా ఆరు రెట్లు పెరిగాయి. 17 ఏళ్ల క్రితం రూ.10 వేలు మాత్రమే ఉండే తులం బంగారం ధర ప్రస్తుతం రూ.60 వేలకు చేరుకుంది. దీని వెనుక కారణం ఏంటంటే.. డాలర్ బలహీనపడినపుడు, బ్యాంక్‌లు (Banking Crisis), స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నపుడు.. బంగారం మంచి పెట్టుబడిగా మారుతుంది. కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులే ఉండడం వల్ల అందరూ బంగారం వైపు చూస్తున్నారు. దీంతో పది గ్రాముల బంగారం ధర వారం రోజుల్లో రూ.55,000 నుంచి రూ.60 వేల పైకి ఎగబాకింది.

Dog Food: కుక్కకు పెట్టే ఆహారాన్ని మనుషులు తినకూడదా..? ఓ వ్యక్తి అదే పనిగా డాగ్ ఫుడ్‌ను తినడంతో ఏం జరిగిందంటే..

ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే సమీప భవిష్యత్తులో బంగారం ధర మరింత పెరగవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. స్టాక్ మార్కెట్లు పతనమవుతుండడం, కరెన్సీలు బలహీనపడుతుండడంతో అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులూ బంగారంపై పెట్టుబడులను క్రమంగా పెంచుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank Of India) కూడా అలాగే చేస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే నెలకు 10 గ్రాముల బంగారం ధర రూ.62 వేలకు చేరవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Weight Loss: 294 కేజీల బరువున్న వ్యక్తి నాలుగేళ్లలో 130 కేజీలకు తగ్గిపోయాడు.. సర్జరీ అస్సలు కాదు.. కానీ ఏకంగా 164 కేజీలు ఎలా తగ్గాడంటే..

Updated Date - 2023-03-22T17:37:55+05:30 IST