Grey Hair: జుట్టు ఇలా మారిపోవడానికి అసలు కారణం ఇదన్నమాట.. మొత్తానికి తేల్చేసిన అమెరికా శాస్త్రవేత్తలు..!
ABN , First Publish Date - 2023-07-20T17:54:37+05:30 IST
వెంట్రుకలలో 50, 60ఏళ్ల తరువాత కనిపించాల్సిన బూడిద రంగు చిన్నవయసులోనే కనిపిస్తుంటుంది. దీనికి సవాలక్ష కారణాలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ, నిజమైన కారణం..
నల్లగా, ఒత్తుగా జుట్టు నిగనిగలాడుతూ ఉంటే ఆ అందమే వేరు. ఆరోగ్యకరమైన కేశసంపద ముఖానికి, మనిషి రూపానికి కూడా అదనపు ఆకర్షణ తెచ్చిపెడుతుంది. కానీ 50, 60ఏళ్ల తరువాత కనిపించాల్సిన బూడిద రంగు చిన్నవయసులోనే కనిపిస్తుంటుంది. దీనికి సవాలక్ష కారణాలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ, నిజమైన కారణం ఏంటనేది ఎవరూ సరిగా చెప్పలేరు. అయితే ఇప్పుడు దీనికి సమాధానం దొరికేసింది. అమెరికా శాస్త్రవేత్తలు బూడిద రంగు జుట్టు వెనుక ఉన్న రహస్యాన్ని బట్టబయలు చేశారు. ఇంతకీ ఆ రహస్యమేంటో తెలుసుకుంటే..
అమెరికాలోని(America) న్యూయార్క్ యూనివర్సిటీ(New York University) శాస్త్రవేత్తలు జుట్టు ఎందుకు బూడిదరంగులోకి(Grey Hair) మారుతుందనే విషయం మీద రెండేళ్ళ పాటు పరిశోధనలు చేశారు. మనిషి శరీరంలో మెలనోసైట్(melono site) అనే మూలకణాలు ఉంటాయి. వీటిని McSC అని అంటారు. ఈ మెలనోసైట్ మూలకణాలు జుట్టు కుదుళ్ళలో పెరుగుదల కంపార్ట్మెంట్ల మధ్య కదిలే ప్రత్యేక సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. సాధారణంగా ఇవి వయసు పెరిగే కొద్దీ జుట్టుకు నలుపురంగు ఇచ్చే సామర్థ్యాన్ని కోల్పోతాయి. అసలిది ఎలా జరుగుుతందంటే.. జుట్టు నలుపురంగులో ఉండటానికి మెలనోసైట్ మూలకణాలు కారణమవుతాయి. ఇందులో ఉత్పత్తి అయ్యే వర్ణద్రవ్యం ఇందుకు తోడ్పడుతుంది. వృద్దాప్యానికి ముందే జుట్టు బూడిదరంగులోకి మారే ప్రక్రియలో జుట్టు కుదుళ్లలో వర్ణద్రవ్యం ఉత్పత్తి ఆగిపోతుంది.
Health Tips: తెలియక చేస్తున్న మిస్టేక్ ఇదే.. పొరపాటున కూడా రెండోసారి వేడి చేయకూడని ఆహార పదార్థాలివీ..!
మెలనోసైట్ మూలకణాలలో ఊసరవెల్లిని పోలిన లక్షణాలు ఉంటాయి. ఇవి వాటి పనితీరు కోల్పోవడం వల్లనే సమస్య అంతా వస్తుంది. వృద్దాప్యానికి ముందే జుట్టు బూడిదరంగులోకి మారే వారి జుట్టు కుదుళ్లలో మూలకణాలు ముందుకు వెనుకకు కదలే సామర్థ్యాన్ని కోల్పోతాయి. దీనివల్ల ఇవి బలహీనం అవుతాయి. ఈ కారణంగా మెలనోసైట్ మూలకణాలు వర్ణద్రవ్యం ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కోల్పోతాయి. ఇలా పనితీరు కోల్పోయిన మూలకణాలు తిరిగి మళ్లీ వర్ణద్రవ్యం ఉత్పత్తి చేయడం అంటూ జరగదు. ఇవి ఇంకా పూర్తీగా వాటి పనితీరు సామర్థ్యాన్ని కోల్పోకముందే వర్ణద్రవ్యం ఉత్పత్తికి ప్రయత్నాలు చేస్తే ఫలితాలు ఉంటాయి. లేదంటే పూర్తీగా వాటి సామర్థ్యం కోల్పోతాయి. ఈ కారణంగా చాలామందిలో జుట్టు బూడిదరంగుకు మారిన తరువాత మళ్లీ ఎంత ప్రయత్నించినా నలుపురంగులోకి మారదు. అయితే ఈ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మెలనోసైట్ మూలకణాల నుండి వర్ణద్రవ్యం ఉత్పత్తి చేసే దిశగా ప్రయోగాలు చేస్తున్నారు.