Shocking: అయ్యో పాపం.. పెళ్లిలో ఏడడుగులు వేస్తూ కుప్ప కూలిన వరుడు.. కారణమేంటంటే..
ABN , First Publish Date - 2023-02-12T14:21:14+05:30 IST
ఆ యువకుడు ఎన్నో ఆశలతో పెళ్లికి (Marriage Ceremony) సిద్ధమయ్యాడు.. ఎంతో వైభవంగా తనకు నచ్చిన అమ్మాయి మెడలో తాళి కట్టాలనుకున్నాడు.. బంధువులతో బరాత్ నడుమ వివాహ వేదిక వద్దకు చేరుకున్నాడు..
ఆ యువకుడు ఎన్నో ఆశలతో పెళ్లికి (Marriage Ceremony) సిద్ధమయ్యాడు.. తనకు నచ్చిన అమ్మాయి మెడలో తాళి కట్టాలనుకున్నాడు.. బంధువులతో బరాత్ నడుమ వివాహ వేదిక వద్దకు చేరుకున్నాడు.. వివాహ తంతు జరుగుతుండగా హఠాత్తుగా కుప్పకూలిపోయాడు.. ఆ యువకుడు గుండెపోటుతో కన్నుమూసినట్టు వైద్యులు తెలిపారు.. ఈ విషాద ఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది (Groom died with heart attack in his wedding).
ఉత్తరాఖండ్‌లోని (Uttarakhand) కఠ్‌గరియాకు చెందిన సమీర్ ఉపాధ్యాయ్ (30) అనే యువకుడికి రాణిఖేత్ ప్రాంతానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. శుక్రవారం కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల ఆనందోత్సాహాల మధ్య వరుడు ఊరేగింపుగా వివాహ వేదిక వద్దకు చేరుకున్నాడు. సమీర్ పీటలపై కూర్చోగానే వివాహ కార్యక్రమం మొదలైంది. వధువుతో కలిసి ఏడడుగులు వేస్తుండగా సమీర్ ఒక్కసారిగా కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతణ్ని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. కార్డియాక్ అరెస్టుతో (Heart Attack) సమీర్ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.