Husband: అమ్మా.. నాన్న ఫోన్లో ఈ ఫొటోలేంటమ్మా.. పక్కన ఉన్న ఆమె ఎవరు..? 11 ఏళ్ల ఆ కూతురి ప్రశ్నతో..!

ABN , First Publish Date - 2023-07-10T18:36:57+05:30 IST

తండ్రి ఫోనుతో ఆడుకుంటున్న ఓ బాలికకు తండ్రి అసభ్యకరమైన ఫోటో ఒకటి కనిపించింది. దీంతో ఆమె దీన్ని తల్లి దృష్టికి తీసుకెళ్లింది. భర్త ఎఫైర్ గురించి తెలుసుకున్న ఆమె భర్తతో గొడవకు దిగింది. ఈ క్రమంలో అతడు కూతురిపై చేయి చేసుకున్నాడు. దీంతో, బాలిక తల్లి తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుజరాత్‌లోని సూరత్‌లో వెలుగు చూసిందీ ఘటన.

Husband: అమ్మా.. నాన్న ఫోన్లో ఈ ఫొటోలేంటమ్మా.. పక్కన ఉన్న ఆమె ఎవరు..? 11 ఏళ్ల ఆ కూతురి ప్రశ్నతో..!

ఇంటర్నెట్ డెస్క్: తండ్రి ఫొనులో గేమ్ ఆడుకుంటోందా చిన్నారి. అనుకోకుండా ఫొటోలు ఉండే ఫోల్డర్‌ను ఓపెన్ చేసింది. ఆ ఫొటోల్లో తండ్రి పక్కన మరో మహిళ. ఆమెను బాలిక ఇంతవరకూ ఎప్పుడూ చూడలేదు. ఫొటో తండ్రి ఆ మహిళతో కాస్తంత చనువుగా కూడా ఉన్నాడు. బాలిక ఆ ఫొటోను తీసుకెళ్లి తల్లికి చూపించింది. నాన్న ఫోనులో ఈ ఫొటోలేంటమ్మా అంటూ అమాయకంగా అడిగింది. అది మొదలు ఆ ఇంట్లో పెద్ద రణరంగమే చెలరేగింది. దీంతో, బాధితురాలు చివరకు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది.

గుజరాత్‌లో(Gujarat) వెలుగు చూసిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే, సురత్‌లోని(Surat) ఆనంద్ నగర్‌లో ఓ వివాహిత నివసిస్తూ ఉంటుంది. 2010లో ఆమెకు వివాహం జరిగింది. పదకొండేళ్ల కూతురు ఉంది. కాగా, ఆమె భర్తకు పరాయిస్త్రీల వ్యామోహం ఉండటంతో తొలి నుంచి సంసారంలో గొడవలు జరిగేవి. అత్తింటి వారు కూడా భర్తకే మద్దతుగా నిలిచేవారు. భర్త ఆమెపై అప్పుడప్పుడూ చేయి కూడా చేసుకునేవాడు. 2013లో ఓ మారు భర్తపై గృహహింస చట్టం కింద కేసుపెడదామనుకున్న ఆమె చివరకు కుటుంబసభ్యుల ఒత్తిడితో వెనక్కు తగ్గింది.

ఇదిలా ఉంటే, గత నెలలో ఆమె కూతురు తండ్రి ఫోనుతో ఆడుకుంటూ ఆయనకు సంబంధించి కొన్ని అసభ్యకరమైన ఫొటోలు చూసింది(Daugher sees photo of dad with other woman). విషయం తల్లి దృష్టికి తీసుకెళ్లింది. తన రహస్యం బట్టబయలు కావడంతో కోపోద్రిక్తుడైన అతడు భార్యతో ఘర్షణకు దిగాడు. చివరకు ముక్కుపచ్చలారని కూతురిపై కూడా చేయి చేసుకున్నాడు. ఇదంతా చూసి తట్టులోలేకపోయిన మహిళ చివరకు పోలీసులను ఆశ్రయించింది. కూతురిపై తన భర్త చేయి చేసుకున్నాడంటూ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Updated Date - 2023-07-10T18:41:02+05:30 IST