మీ ఫేస్‌బుక్ ప్రోఫైల్‌ను ఎవరో సీక్రెట్‌గా చూస్తున్నారని డౌటా..? అయితే వారిని ఇలా కనిపెట్టేయండి..!
ABN , First Publish Date - 2023-01-20T14:23:16+05:30 IST
మాట్లాడకపోయినా ఎప్పటికప్పుడు అకౌంట్ మీద డిటెక్టివ్ కన్ను వేసినవాళ్ళు కొందరుంటారు..
ప్రకాష్ ఎన్నో ఏళ్ళ నుండి ఫేస్ బుక్ వాడుతున్నాడు. తనకు ఫేస్ బుక్ లో ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నా సరదాగా చనువుగా చాట్ చేసేది తన పోస్ట్ లకు రియాక్ట్ అయ్యేది కొందరే.. తనతో మాట్లాడకపోయినా ఎప్పటికప్పుడు తన అకౌంట్ గురించి డిటెక్టివ్ కన్ను వేసి తన అకౌంట్ చెక్ చేస్తున్నవాళ్ళు కొందరున్నట్టు అతనికి అనిపించింది. వెంటనే వాళ్ళు ఎవరో కనిపెడదామని డిసైడ్ అయ్యాడు. కొన్ని రకాల సెట్టింగ్స్ ద్వారా కనుక్కున్నాడు కూడా.. ప్రకాష్ లాగే మీ ఫేస్ బుక్ అకౌంట్ ను రహస్యంగా చూస్తున్నవారెవరో మీరు కూడా కనుక్కోవచ్చు. దానికోసం ఈ క్రింది స్టెప్స్ ఫాలో అయిపోవడమే..
మొదటగా మీ ల్యాప్ టాప్ లేదా కంప్యూటర్ లో బ్రౌజర్ ను ఓపెన్ చేయాలి. బ్రౌజర్ లో మీ ఫేస్ బుక్ ఐడితో ఫేస్ బుక్ లాగిన్ అవ్వాలి. ఇలా లాగిన్ అయిన తరువాత అకౌంట్ ఓపెన్ అవుతుంది. మీ ప్రొపైల్ మీద రైట్ క్లిక్ ఇవ్వాలి. ఇప్పుడు వ్యూ పేజి సోర్స్ ను క్లిక్ చేయాలి. ఇప్పుడొక న్యూ పేజీ ఓపెన్ అవుతుంది. తరువాత మళ్ళీ ప్రొపైల్ పేజీకి బ్యాక్ వచ్చి అక్కడ CTRL+U ను కొట్టాలి. అప్పుడు ఒక కొత్త టాబ్ ఓపెన్ అవుతుంది. అక్కడ CTRL+F కొట్టాలి. ఇందులో BUDDY_ID అని సెర్చ్ చేయాలి. ఇలా చేసిన తరువాత చాలా buddy_id లు వస్తాయి. 15నెంబర్లు ఉన్న ఈ డిజిటల్ కోడ్ ను కాపీ చేసుకోవాలి.
ఇదంతా అయ్యాక మరొక ట్యాబ్ ఓపెన్ చేసి అక్కడ facebook.com/profile id పేస్ట్ చేయాలి. ఇలా చేసిన తరువాత మీ ఫేస్ బుక్ అకౌంట్ ను సీక్రెట్ గా చూసిన ఫేస్ బుక్ ఐడి ఓపెన్ అవుతుంది. మొత్తం వివరాలు తెలుసుకున్న తరువాత మీ మీద ఓ కన్నేసి ఉంచిన సదరు అకౌంట్ వ్యక్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవచ్చు. మరింకెందుకు ఆలస్యం ప్రొసీడ్ అయిపోండి.