Charging: ఛార్జర్ ఇంటి దగ్గర మర్చిపోయారా? ఛార్జర్ లేకపోయినా మీ ఫోన్‌ను ఛార్జింగ్ చేసుకోవచ్చు.. ఇలా ట్రై చేయండి.
ABN , First Publish Date - 2023-10-21T16:09:53+05:30 IST
మీరు ఛార్జర్‌ను ఇంటి దగ్గర మర్చిపోయారా? మీ ఫోన్ బ్యాటరీ పూర్తిగా అయిపోయిందా? మీరు కనుక అలాంటి పరిస్థితుల్లో చిక్కుకుంటే ఆందోళన పడాల్సిన పని లేదు. ఎందుకంటే ఛార్జర్ లేకపోయినా ఫోన్‌ను ఛార్జ్ చేసే కొన్ని పద్ధతులు ఉన్నాయి.
మీరు ఛార్జర్ (Charger)ను ఇంటి దగ్గర మర్చిపోయారా? మీ ఫోన్ బ్యాటరీ (Battery) పూర్తిగా అయిపోయిందా? మీరు కనుక అలాంటి పరిస్థితుల్లో చిక్కుకుంటే ఆందోళన పడాల్సిన పని లేదు. ఎందుకంటే ఛార్జర్ లేకపోయినా ఫోన్‌ను ఛార్జ్ (Charging Mobile) చేసే కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఫోన్ బ్యాటరీ పూర్తిగా ఖాళీ అయిపోయిన అత్యవసర పరిస్థితుల్లో మీకు ఉపయోగపడే అటువంటి 3 పద్ధతుల గురించి తెలుసుకుందాం..
ఛార్జర్ లేకుండా ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి, పవర్ బ్యాంక్ (Power Bank), వైర్‌లెస్ ఛార్జింగ్ (Wireless Charging) లేదా USB పోర్ట్ (USB Port) వంటి ఎంపికలు మీకు ఉపయోగకరంగా ఉంటాయి. అయితే ఈ పద్ధతులలో మీ ఫోన్‌ను ఛార్జ్ చేయాలంటే అందుకు అనుగుణంగా ఉండే ఛార్జింగ్ కేబుల్ లేదా వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ కావాలి. కాబట్టి మీ దగ్గరలో ఉన్న ఎవరి వద్దనైనా రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ ఉన్న ఫోన్ ఉందేమో తెలుసుకోవాలి. అలాగే మీ ఫోన్‌కు కూడా అలాంటి ఫీచర్ ఉండాలి. అప్పుడు ఎలాంటి కేబుల్, ఛార్జర్ లేకుండానే మీ ఫోన్ ఛార్జ్ అయిపోతుంది. ఐఫోన్‌లు, Galaxy S23, Galaxy S23 Plus, Galaxy S23 Ultra మరియు Motorola Edge 40 వంటి అనేక ఫోన్‌లు ఈ ఫీచర్‌తో వస్తున్నాయి.
Hot Water: చలికాలం వచ్చేసింది.. వేడి నీళ్ల స్నానం చేసేందుకు గీజర్ లేదా? అయితే వీటిపై ఓ లుక్కేయండి..
అలాగే మీరు యూఎస్‌బీ పోర్ట్ ద్వారా కూడా మీ ఫోన్‌ను ఛార్జ్ చేయవచ్చు. విమానాశ్రయాలు, కేఫ్‌లు, హోటళ్లలో ఇటువంటి USB పోర్ట్‌లను సులభంగా కనుగొనవచ్చు. ఈ విధానంలో ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి మాత్రం మీరు కేబుల్ కలిగి ఉండాలి. అలాగే వైర్‌లెస్ ఛార్జర్లు, పవర్ బ్యాంకులు ద్వారా కూడా ఛార్జర్ సహాయం లేకుండా మీ ఫోన్‌ను ఛార్జ్ చేసుకోవచ్చు. కేవలం కేబుల్ ఉంటే సరిపోతుంది.