World's tallest living man: అరుదైన దృశ్యం.. ప్రపంచంలో అత్యంత పొడవైన, పొట్టి వ్యక్తులు ఒకేచోట..! ఫోటో వైరల్..
ABN , Publish Date - Dec 14 , 2023 | 03:46 PM
కోసెన్, ఈ డిసెంబర్ 10 నాటికి తన 41వ పుట్టిన రోజు జరుపుకున్నాడు.
బాగా పొడవున్న వ్యక్తిని చూడటం ఎంత అరుదో, బాగా పొట్టి మనిషిని చూసినా కూడా అంతే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ వీళ్ళిద్దరూ ఇప్పుడు ప్రపంచ రికార్డులలో స్థానం సంపాదించుకున్న విషయం తెలుసా.. ప్రపంచంలోనే అతి చిన్న వ్యక్తి, అతి పెద్ద వ్యక్తి ఈ ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ప్రపంచంలోనే అత్యంత ఎతైన మనిషిగా రికార్డు కలిగిన వ్యక్తి కోసెన్, ఈ డిసెంబర్ 10 నాటికి తన 41వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లండన్‌లో ప్రపంచంలోనే అత్యంత పొట్టి వ్యక్తిని కలిసిన పాత వీడియోను షేర్ చేసింది. అతను 2009లో ప్రపంచంలోనే అత్యంత ఎతైన వ్యక్తిగా నిలిచాడు. మరోవైపు నేపాల్‌కు చెందిన చంద్ర బహదూర్ డాంగి 251 సెంటీమీటర్లు, అతని బరువు కూడా కేవలం 32 పౌండ్లు, 2014లో లండన్లో జరిగిన ఓ ఈ వెంట్‌లో వీరిద్దరిదీ ప్రత్యేకంగా కలుసుకున్నారు.
ఇది కూడా చదవండి: శీతాకాలం మెడ భాగం నల్లగా మారిందా.. దీనికి కారణాలు, చికిత్సలు ఏంటంటే..!!
ఇన్ స్టాగ్రామ్‌లో వీడియోను GMR, Mr కోసెన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. సజీవంగా ఉన్న అత్యంత ఎతెైన వ్యక్తి గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ డే రోజున చంద్ర డాంగిని కలిశాడు. వారితో పాటు GMR ఎడిటర్ - ఇన్ - ఛీఫ్, క్రెయిగ్ గ్లెన్డే కూడా వారిని కలిసి అభినందించాడు. క్లిప్‌లో, మిస్టర్ కోసెన్, మిస్టర్ డాంగి ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
సజీవంగా నిలుచున్న అతిపెద్ద వ్యక్తి చేతివేలు అతని చేతి మణి కట్టు నుండి మధ్యవేలు వరకూ 11.2 అంగుళాలు ఉంది. అతని ఎత్తుకి పిట్యూటరీ జిగాంటిజం అని పిలిచే ఒక పరిస్థితి ఫలితంగా అంత పెరిగాడని తేలింది.