Home Making: చలికాలంలో ఇల్లు వెచ్చగా ఉండటానికి 9 టిప్స్..
ABN , First Publish Date - 2023-11-30T16:24:34+05:30 IST
ఈ 9 టిప్స్ ఫాలో అయితే చాలు. బయట ఎంత చలి ఉన్నా ఇంట్లో భలే వెచ్చగా ఉంటుంది.
చలికాలంలో వెచ్చని వాతావరణంలో ఉండాలని అనిపిస్తుంది. బయటి వాతావరణం ఉదయం, సాయంత్రం మాత్రమే చలిగా ఉంటుంది. కానీ ఇళ్లలో అలా కాదు. రోజంతా చలి ఉంటుంది. ఉదయం, సాయంత్రం ఈ చలి మరీ విపరీతంగా ఉంటుంది. ఇప్పట్లో చాలా ఇళ్లలో టైల్స్ వినియోగించడం వల్ల ఈ చల్లదనం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ 9 టిప్స్ పాటించడం వల్ల ఇంటిని వెచ్చగా మారుకోవచ్చు.
కిటికీలు తలుపులకు ముదురు రంగులో, మందంగా ఉన్న కర్టెన్లు వేయాలి. ఇవి చలిని లోపలికి రానివ్వవు.
సోఫాలు, కుర్చీల మీద సాధారణ దిండ్లు, కవర్లకు బదులుగా ఉన్ని, వెల్వెట్ దిండ్లు, దిండ్లు కవర్లు, సోఫా ను కప్పి ఉంచడానికి వినియోగించాలి. ఇవి వెచ్చదనాన్ని ఇస్తాయి.
ఇంటి పైకప్పు లేదా గోడలకు కిటికీలు, వెంటిలేటర్లు ఉంటే వాటిని క్లోజ్ చేయాలి.
ఇదికూడా చదవండి: Health Facts: అందరూ కామన్ గా చేస్తున్న ఈ బిగ్ మిస్టేక్ వల్లే ఏటా 50లక్షల మరణాలు.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన ప్రపంచ ఆరోగ్య సంస్థ..
ఇప్పట్లో చాలా ఇళ్ళలో టైల్స్ ఉంటున్నాయి. వీటి కారణంగా ఫ్లోర్ చాలా చల్లగా ఉంటుంది. దీన్ని అధిగమించడానికి దుప్పట్లు, కార్పెట్లు బండలమీద పరచాలి.
నిద్రపోయేటప్పుడు వెచ్చగా ఉండాలంటే పరుపు మీద ఉన్ని బెడ్ షీట్లు, ఉన్ని దిండు కవర్లు ఏర్పాటుచేసుకోవాలి.
ఇంట్లో సువాసనతో కూడిన కొవ్వొత్తులు వెలిగిస్తే ఇల్లంతా వెచ్చగా ఉంటుంది. లేదంటే ఎసెంటియల్ ఆయిల్స్ నీటిలో వేసి ఎయిర్ డిఫ్యూజర్స్ ఏర్పాటుచేసుకోవచ్చు.
ఉదయం, సాయంత్రం కిటికీలు మూసి ఉంచాలి. సూర్యుడు ఉదయించి ఎండ ఎక్కువగా వచ్చిన తరువాత మాత్రమే కిటికీలు, తలుపులు తీయాలి. దీనివల్ల ఇల్లు వెచ్చగా ఉంటుంది.
ఇంటి ఫ్లోర్ ను మాటిమాటికి తుడవడం మానేయాలి.
ఆహారం వేడి వేడిగా తిన్నా కూడా చలి ఫీలింగ్ తక్కువగా ఉంటుంది.