Horoscope : రాశిఫలాలు

ABN , First Publish Date - 2023-07-06T08:03:19+05:30 IST

నేడు (6-7-2023 - గురువారం) ఒక రాశివారి ఫలితం అదిరిపోయింది. వారికి అదనపు ఆదాయం కూడా కలిసొస్తుందట. ఇక కొన్ని రాశులవారికి పలు సూచనలు చేయడం జరిగింది. అది పాటిస్తే ఫలింత మరింత బాగుంటుందట. ఇక దాదాపు అన్ని రాశుల వారికి ఫలితం బాగానే ఉంది.

Horoscope : రాశిఫలాలు

నేడు (6-7-2023 - గురువారం) ఒక రాశివారి ఫలితం అదిరిపోయింది. వారికి అదనపు ఆదాయం కూడా కలిసొస్తుందట. ఇక కొన్ని రాశులవారికి పలు సూచనలు చేయడం జరిగింది. అది పాటిస్తే ఫలింత మరింత బాగుంటుందట. ఇక దాదాపు అన్ని రాశుల వారికి ఫలితం బాగానే ఉంది.

MESHAM-01.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

బృందకార్యక్రమాలు, వేడుకలతో ఇల్లు సందడిగా వుంటుంది. మనసు ఉల్లాసంగా వుంటుంది. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం. ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. దత్తకవచ పారాయణ మంచిది.

MESHAM-02.jpg

వృషభం (ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. గౌరవ, ప్రతిష్ఠలు పెంపొందుతాయి. పైఅధికారుల సహకారంతో ఉన్నత లక్ష్యాలు అందుకుంటారు. పెద్దల ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని రీతిలో విజయాలు సాధిస్తారు.

MESHAM-03.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

సకాలంలో డబ్బు చేతికి అందుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక విషయాల్లో మీ వైఖరిని సమీక్షించుకోవడం అవసరం. రక్షణ, న్యాయ, బోధన, ఆడిటింగ్‌, ప్రకటనలు, ట్రావెల్‌ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరమైన రోజు. సాయిబాబా ఆరాధన మంచిది.

MESHAM-04.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. షేర్లు, మ్యూచ్యువల్‌ ఫండ్‌ లావాదేవీలకు అనుకూలం. ఇన్‌స్టాల్‌మెంట్లు, లోన్‌లపై వస్తువుల కొనుగోలుకు అనుకూలం. పన్నుల వ్యవహారాల్లో అనుకోని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. గాయత్రీమాత ఆరాధన శుభప్రదం.

MESHAM-05.jpg

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

శ్రీవారు, శ్రీమతితో చర్చలు, ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూల సమయం. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. జనసంబంధాలు విస్తరిస్తాయి. సంకల్పం ఫలిస్తుంది. గోసేవలో పాల్గొనండి.

MESHAM-06.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అందుకుంటారు. వ్యవసాయం, పరిశ్రమలు, హోటల్‌, ఆస్పత్రి రంగాల వారికి ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా వుంటుంది. సహోద్యోగుల సహకారం లో పించడంతో లక్ష్య సాధనలో ఇబ్బందులు పడతారు. అదనపు ఆదాయం లభిస్తుంది. సాయిబాబా ఆలయాన్ని దర్శించండి.

MESHAM-07.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

ప్రేమలు ఫలిస్తాయి. చిట్‌ఫండ్‌లు, బ్యాంకులతో లావాదేవీలు లాభిస్తాయు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. బోధన, ఆడిటింగ్‌, గార్మెంట్స్‌ రంగాల వారు ఆర్థిక విషయాల్లో నిదానం పాటించది. సంతతి విషయంలో సంకల్పం ఫలిస్తుంది. సాయి ఆరాధన మంచిది.

MESHAM-08.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

దూరంలో వున్న కుటుంబ సభ్యులు ఇల్లు చేరతారు. బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. బదిలీలు, మార్పులు కొంత అసౌకర్యం కలిగించే అవకాశం ఉంది. దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి.

MESHAM-09.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

స్నేహానుబంధాలు బలపడతాయి. ఆర్థిక విషయాలకు సంబంధించిన చర్చలు, ప్రయాణాలు ఫలిస్తాయి. విలువైన పత్రాలు చేతికి అందుతాయి. కమ్యూనికేషన్‌ రంగంలోని వారికి శుభప్రదం. చిన్నారుల వైఖరి కొంత ఆవేదన కలిగిస్తుంది. దక్షిణామూర్తిని ఆరాధించండి.

MESHAM-10.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

తల్లిదండ్రుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అదనపు ఆదాయం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో కొంత నిరుత్సాహకరంగా ఉంటుంది. గౌరవ ప్రతిష్ఠలు పెంపొందుతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి.

MESHAM-11.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

ఆడిటింగ్‌, రవాణా, టూరిజం, రక్షణ రంగాల వారికి ప్రోత్సాహక సమయం. కీలక సమాచారం లభిస్తుంది. ప్రయాణాలు, సమాశాలు, వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేస్తారు. చేపట్టిన పనులకు అనుకోని ఆటంకాలు ఎదురయ్యే అ వకాశం ఉంది. దత్తాత్రేయ స్వామి ఆరాధన శుభప్రదం.

MESHAM-FINAL-12.jpg

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడులు, పొదుపు పథకాల నుంచి మంచి ప్రతిఫలం అందుకుంటారు. ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. ఆధ్మాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మనులు వాయిదా పడటంతో మనసు చికాకుగా ఉంటుంది. గోసేవ శుభప్రదం.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - 2023-07-06T08:13:05+05:30 IST