Horoscope : రాశిఫలాలు
ABN , First Publish Date - 2023-07-08T08:18:55+05:30 IST
నేడు (8-7- 2023 - శనివారం) దాదాపు అన్ని రాశుల వారికి కొన్ని సూచనలు చేయడం జరిగింది. కొన్ని రాశుల వారికి గోసేవ చేయాలని సూచించడం జరిగింది. అన్ని రాశుల వారి ఫలితాలు నేడు బాగానే ఉన్నాయి కానీ ఈ సూచనలు పాటిస్తే మరింత బాగుంటుంది. నేడు అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
నేడు (8-7- 2023 - శనివారం) దాదాపు అన్ని రాశుల వారికి కొన్ని సూచనలు చేయడం జరిగింది. కొన్ని రాశుల వారికి గోసేవ చేయాలని సూచించడం జరిగింది. అన్ని రాశుల వారి ఫలితాలు నేడు బాగానే ఉన్నాయి కానీ ఈ సూచనలు పాటిస్తే మరింత బాగుంటుంది. నేడు అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
సినీ, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఎగుమతులు, ఫొటోగ్రఫీ, ఉన్నత విద్యా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. మీ పనులకు ఆటంకాలు ఎదురయినా పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ఆంజనేయ స్వామి ఆరాధన మంచిది.
వృషభం (ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
చదువుల కోసం అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. సమావేశాలు, చర్చల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. యూనియన్ వ్యవహారాలు, ప్రదర్శనలకు అనుకూలం.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. ఉన్నత పదవుల కోసం చే సే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అందుకుంటారు. శ్రీరాముని దర్శనం మంచిది.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
విద్యార్థులకు శుభప్రదం. ప్రయాణాలు చర్చలకు అనుకూలం. రక్షణ, న్యాయ, బోధన, రవాణా, ఆడిటింగ్ రంగాల వారు పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. వాహనాలు సమకూర్చుకుంటారు. వ్యూహాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. మహావిష్ణువు ఆరాధన మంచిది.
సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
బీమా, పన్నులు, మ్యూచ్యువల్ ఫండ్‌ల గురించి ఆరా తీస్తారు. దానధర్మాలకు ఖర్చు చేస్తారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. పెట్టుబడులు లాభిస్తాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. గతంలో చేసిన శ్రమకు ఫలితం అందుకుంటారు. గోసేవలో పాల్గొనండి.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
శ్రీవారు, శ్రీమతి వైఖరి గురించి ఆలోచిస్తారు. సమావేశాల్లో గౌరవ, మర్యాదలు అందుకుంటారు. వేడుకల్లో పాల్గొంటారు. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. వేంకటేశ్వర స్వామి ఆలయదర్శనం శుభప్రదం.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
గతంలో చేసిన శ్రమకు ఫలితం అందుకుంటారు. రహస్య సమాచారం లహాస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విందు వినోదాల్లో ఉల్లాసంగా గడుపుతారు. వృత్తిపరమైన ఒత్తిళ్లు అధిగమించి లక్ష్యాలు సాధిస్తారు. దుర్గాదేవి అష్టకం పారాయణ చేయండి.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
బోధన, బ్యాంకింగ్, ప్రకటనల రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకంగా ఉంటుంది. షాపింగ్‌లో నాణ్యతను గమనించడం అవసరం. ఆర్థిక విషయాల్లో ప్రియతముల సహకారం లభిస్తుంది. విద్యార్థులకు శుభప్రదం. గోసేవ శుభప్రదం.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
తల్లిదండ్రుల సూచనలు పాటించడం మంచిది. ఉద్యోగం విషయంలో కొత్త ఆలోచనలు చేస్తారు. పైఅధికారుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో మార్పులకు అనుకూల సమయం. కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
బంధుమిత్రుల కలయిక ఉల్లాసం కలిగిస్తుంది. విద్యార్థులు పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. ప్రయాణాలు, చర్చలు, విద్యా విషయాల్లో అంచనాలు ఫలిస్తాయి. భాగస్వామి విషయంలో అభివృద్ది కనిపిస్తుంది. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకర సమయం. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సన్నిహితుల సహకారంతో ఆర్థిక పరమైన లక్ష్యాలు సాధిస్తారు. సంకల్పం నెరవేరుతుంది.
మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
క్రీడలు, టెలివిజన్, ప్రకటనల రంగాల వారు కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు. వేడుకల్లో పాల్గొంటారు. పొదుపు పథకాల గురించి ఆరా తీస్తారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. చిన్నారుల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది.
- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ