Horoscope : రాశిఫలాలు
ABN , First Publish Date - 2023-07-13T08:24:36+05:30 IST
నేడు (13-7-2023 - గురువారం) ఓ రాశివారికి ఇల్లు, స్థలసేకరణకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. కర్కాటక రాశి వారు సహకార సంఘాలు, యూనియన్ కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తారు. ఇక సింహరాశివారు నేడు గుడ్ న్యూస్ అందుకుంటారట. ఇక మిగిలిన అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
నేడు (13-7-2023 - గురువారం) ఓ రాశివారికి ఇల్లు, స్థలసేకరణకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. కర్కాటక రాశి వారు సహకార సంఘాలు, యూనియన్ కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తారు. ఇక సింహరాశివారు నేడు గుడ్ న్యూస్ అందుకుంటారట. ఇక మిగిలిన అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
ఇల్లు, స్థలసేకరణకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. అద్దె నిర్ణయాలకు అనుకూలం. ఆర్థిక వ్యవహారాల్లో మీ ఆలోచనలు ఒక కొలిక్కి వస్తాయి. గృహోపకరణాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. దత్తాత్రేయ స్వామి ఆరాధన మంచిది.
వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూల సమయం. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. అడ్మిషన్లు పొందుతారు. మార్కెటింగ్, కమ్యూనికేషన్లు, ఏజెన్సీలు, స్టేషనరీ వ్యాపారులకు అనుకూల సమయం. శుభవార్త అందుకుంటారు. సాయి ఆలయాన్ని దర్శించండి.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
ఉన్నత విద్య, విదేశీ గమన ప్రయత్నాలు ఫలిస్తాయి. సినిమాలు, రాజకీయ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఎగుమతులు, ఫొటోగ్రఫీ, మైనింగ్ వ్యాపారులకు ప్రోత్సాహకరమైన సమయం. గోసేవ శుభప్రదం.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
సహకార సంఘాలు, యూనియన్ కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల ఉద్యోగులకు సంకల్పం నెరవేరుతుంది. బృందకార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి. ఆర్థిక నిర్ణయాలు లాభిస్తాయి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ మంచిది.
సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
తల్లిదండ్రుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. దూర ప్రాంతంలో ఉన్న ప్రముఖులను కలుసుకుంటారు. ప్రభుత్వ రంగ సంస్థల వారు గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. ప్రమోషన్లు అందుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి కీలక సమాచారం అందుతుంది.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
ఆడిటింగ్, ఉన్నత విద్య, కళలు, సేవా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం ల భిస్తుంది. విద్యాసంస్థలతో పనులు పూర్తవుతాయి. సాయిబాబా ఆలయంలో ప్రదక్షిణలు చేయడం శుభప్రదం.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
ఆరోగ్యం మెరుగుపడుతుంది. రుణప్రయత్నాలు ఫలిస్తాయి. పన్నులు, బీమా, పెన్షన్, గ్రాట్యుటీ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. లక్ష్య సాధనలో గత అనుభవం తోడ్పడుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో పెద్దల సహకారం లభిస్తుంది.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు సంభవం. బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. కొత్త పరిచయాలు లాభిస్తాయి. రాజకీయ, కళా రంగాల వారికి పలుకుబడి పెరుగుతుంది. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైద్యం, పరిశ్రమలు, హోటల్, ఫైనాన్స్ రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. వ్యవసాయ రంగంలోని వారికి నిధులు సర్దుబాటవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సాయిబాబా ఆలయాన్ని దర్శించండి.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
టెలివిజన్, క్రీడలు, విద్యా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వేడుకల్లో పాల్గొంటారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. సంతానం విషయంలో మంచి పరిణామాలు చోటుచేసుకుంటాయి. దక్షిణామూర్తి ఆరాధన మంచిది.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
కుటుంబ సభ్యులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. పనివారి నియామకానికి అనుకూలం. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. కొత్త పనులు ప్రారంభానికి అనుకూలం. గోమాత సేవ శుభప్రదం.
మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. మార్కెటింగ్, ఏజెన్సీలు, రవాణా వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూల సమమం. ప్రియతముల నుంచి శుభవార్త అందుకుంటారు. దత్తకవచ పారాయణ మంచిది.
- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ