Horoscope : రాశిఫలాలు
ABN , First Publish Date - 2023-08-15T07:58:13+05:30 IST
నేడు (15-8-2023 - మంగళవారం) కొందరి రాశిఫలాలు కాస్త ఇబ్బందికరంగానే ఉన్నాయి. కొన్ని రంగాలకు చెందిన మేషరాశివారికి అనుకోని చిక్కులు ఎదురవుతాయి. వృషభరాశి వారికి కూడా అనుకోని అవాంతరాలు ఎదురవుతాయి. ఇక సింహరాశి వారు అయితే నేడు కొత్త పనులేవి చేపట్టకపోవడం ఉత్తమం. మీ రాశి ఫలితం ఎలా ఉందోతెలుసుకుని కాస్త జాగ్రత్త వహించడం ఉత్తమం.
నేడు (15-8-2023 - మంగళవారం) కొందరి రాశిఫలాలు కాస్త ఇబ్బందికరంగానే ఉన్నాయి. కొన్ని రంగాలకు చెందిన మేషరాశివారికి అనుకోని చిక్కులు ఎదురవుతాయి. వృషభరాశి వారికి కూడా అనుకోని అవాంతరాలు ఎదురవుతాయి. ఇక సింహరాశి వారు అయితే నేడు కొత్త పనులేవి చేపట్టకపోవడం ఉత్తమం. మీ రాశి ఫలితం ఎలా ఉందోతెలుసుకుని కాస్త జాగ్రత్త వహించడం ఉత్తమం.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
టెలివిజన్, అడ్వర్టయిజ్‌మెంట్, పొదుపు సంస్థలు, క్రీడల రంగాల వారికి అనుకోని చిక్కులు ఎదురవుతాయి. ప్రియతముల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. సంతానం విషయంలో ఖర్చులు అధికం. ఆర్థిక విషయాల్లో తొందరపాటు తగదు.
వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
రియల్ ఎస్టేట్, నిర్మాణరంగాలకు చెందిన వారికి అనుకోని అవాంతరాలు ఎదురవుతాయి. తల్లిదండ్రుల ఆోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. కుటుంబ సభ్యులతో సమయం గడిపే ప్రయత్నం చేస్తారు. మనసును ఏదో వెలితి బాధిస్తుంది.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు ఇది సమయం కాదు. రవాణా, బోధన, స్టేషనరీ, ఏజెన్సీ, మార్కెటింగ్ రంగాల వారు జాగ్రత్తలు పాటించాలి. చర్చల సమయంలో తొందరపాటు తగదు. అన్నదమ్ముల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించండి.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులు అదుపుతప్పే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల కారణంగా మనస్ఫర్ధలు వస్తాయి. విలువైన వస్తువుల కొనుగోలు సందర్భంగా నాణ్యత గమనించాలి అన్నదానం చేయడం శుభప్రదం.
సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
తలపెట్టిన పనులు పూర్తి కాకపోవడంతో మనసు చికాకుగా ఉంటుంది. కొత్త పనుల ప్రారంభానికి ఇది సమయం కాదా. అనవసర విషయాల్లో జోక్యం తగదని గ్రహించండి. మీ ఆలోచనలు సమీక్షించుకుంటారు. దుర్గాదేవి ఆలయాన్ని దర్శించండి.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
అనవసరమైన అపనిందుల ఎదుర్కోవాల్సి రావచ్చు. సినిమాలు, రాజకీయ రంగాల వారు జాగ్రత్తలు పాటించాలి. దూరంలో ఉన్న బంధుమిత్రులకు సంబంధించిన ఒ క సమాచారం ఆవేదన కలిగిస్తుంది. ఫొటోగ్రఫీ, రచనలు, సేవారంగాల వారికి శుభప్రదం.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
బృందకార్యక్రమాల కోసం ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంది. స్టాక్‌మార్కెట్ లావాదేవీలు, పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. రుణప్రయత్నాలు ఫలించకపోవచ్చు. దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణ మంచిది.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోచ్చు. పైఅధికారు వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ప్రముఖుల సహకారంతో లక్ష్య సాధనకు ప్రయత్నిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు మాటపడాల్సి వస్తుంది. పెద్దలతో వి వాదాలకు దూరంగా ఉండటం మేలు. గోసేవ మనసుకు స్వాంతన కలిగిస్తుంది.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
రవాణా, పోలీస్, విద్యారంగాల వారు జాగ్రత్తలు పాటించాలి. పైచదువుల కోసం చేసే ప్రయత్నాల్లో చిన్న పొరపాట్ల కారణంగా నష్టపోతారు. మీ అంచనాలు తలకిందులయ్యే అవకాశం ఉంది. న్యాయ వివాదాల్లో చిక్కుకొనే ప్రమాదం ఉంది. ఆంజనేయ స్వామి ఆరాధన మంచిది.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
సకాలంలో డబ్బు చేతికి అందుకపోవడంతో ఇబ్బంది పడతారు. ఖర్చులు అధికం. పన్నుల వ్యవహారాల వల్ల చిక్కులు ఎదురవుతాయి. విలువైన వస్తువులు కోల్పోయే ప్రమాదం ఉంది. ఆస్పత్రులు సందర్శించాల్సి రావచ్చు. దుర్గాదేవిని దర్శించండి
.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
కుటుంబ సభ్యుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. సమావేశాల్లో మాటపడాల్సి వస్తుంది. ఖ ర్చులు అంచనాలు మించే అ వకాశం ఉంది. కొత్త స్నేహాల వల్ల అనుకోని చిక్కులు ఎదుర్కొంటారు. సుబ్రహ్మణ్య అష్టక పారాయణ శుభప్రదం.
మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
ఆహార నియమాలు పాటించాలి. సహోద్యోగుల వ్యవహారశైలి ఇబ్బంది కలిగిస్తుంది. వ్యవసాయం, పరిశ్రమలు, హోటల్, హాస్టల్ రంగాల వారు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాల్సి వస్తుంది. వైద్యరంగంలోని వారికి శుభప్రదం. గోసేవలో పాల్గొనండి.
- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ