Horoscope : రాశిఫలాలు
ABN , First Publish Date - 2023-08-21T08:03:57+05:30 IST
నేడు (21-8-2023 - సోమవారం) ఒకటేమిటి అన్ని రాశుల వారి ఫలితం చాలా బాగుంది. ప్రతి ఒక్క రాశివారికి ఏదో ఒక మంచి అయితే జరుగుతుంది. ముఖ్యంగా మేష రాశి వారు ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. వృషభ రాశివారికి వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. మిథున రాశి వారు ఒక శుభవార్త అందుకుంటారు. ఇక అన్ని రాశుల వారి ఫలితం ఎలా ఉందో చూద్దాం.
నేడు (21-8-2023 - సోమవారం) ఒకటేమిటి అన్ని రాశుల వారి ఫలితం చాలా బాగుంది. ప్రతి ఒక్క రాశివారికి ఏదో ఒక మంచి అయితే జరుగుతుంది. ముఖ్యంగా మేష రాశి వారు ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. వృషభ రాశివారికి వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. మిథున రాశి వారు ఒక శుభవార్త అందుకుంటారు. ఇక అన్ని రాశుల వారి ఫలితం ఎలా ఉందో చూద్దాం.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
కొత్త పరిచయాలు లక్ష్య సాధనకు తోడ్పడతాయి. వివాహ నిర్ణయాలకు అనుకూలం. సమావేశాలు, వేడుకలు, ఉల్లాసం కలిగిస్తాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. అనుబంధాలు బలపడతాయి.
వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. పరిశ్రమలు, హోటల్, ఆస్పత్రులు, సేవల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పట్టుదలతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మిం చిన వారు)
శుభవార్త అందుకంటారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. చిన్నారుల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. క్రీడలు, టెలివిజన్, విద్యా సం స్థలు, చిట్‌ఫండ్‌లు, ప్రకటనల రంగాల వారికి ప్రోత్సాహకరం. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
గృహారంభ, ప్రవేశాలకు అనుకూలం. బదిలీలు, మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రి యల్ ఎస్టేట్, నిర్మాణ రం గాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది.
సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
విద్యాసంస్థల్లో ప్రవేశానికి అనుకూలం. కాం ట్రాక్టులు, అగ్రిమెంట్లు లాభిస్తాయి. విలువైన పత్రాలు అందుకుంటారు. చర్చలు, ప్రయాణాలు ఫలిస్తాయి. లక్ష్య సాధనలో సోదరీ సోదరుల ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. శివారాధన మేలుచేస్తుంది.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
పెట్టుబడులు, పొదుపు పథకాలకు సంబంధిం చిన సమాచారం సేకరిస్తారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఆర్థికపరమైన నిర్ణయాల్లో గత అనుభవం తోడ్పడుతుంది. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా వుంటుంది. ఎగుమతులు, సినిమాలు, రాజకీయ రం గాల వారికి ఆర్థికంగా అనుకూల సమయం.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
పదిమందిని కలుపుకొని మంచి పనికి శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. యూనియన్ కార్యకలాపాలు, వేడుకల్లో పాల్గొం టారు. బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. కొత్త ఆలోచనలు అమలు చేస్తారు.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
సినీ, రాజకీయ, న్యాయ, బోధన, విదేశీ రంగాల వారు పెద్దల సహకారంతో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో ప్రముఖులను కలుసుకుంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉం టుంది. శివాలయాన్ని దర్శించండి.
దనుస్సు (నవంబరు 23 - డిసెం బరు 21 మధ్య జన్మించిన వారు)
వేడుకలు, ఆర్థికపరమైన సమావేశాల్లో పాల్గొంటారు. బం దుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్దంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. వ్యాపారరంగంలోని వారు అనుకూల ఫలితాలు అందుకుంటారు.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
పెన్షన్, గ్రాట్యుటీ, మెడికల్ క్లెయిములు పరిష్కారం అవుతాయి. అడ్వాన్సులు, రుణాలు అందుకుంటారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుం ది. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. పైఅధికారుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష ్యాలు సాధిస్తారు.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. న్యాయ వివాదాలు పరిష్కారం అవుతాయి. భాగస్వామి సహకారంతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. వివాహ నిర్ణయాలకు అనుకూలం. రక్షణ, బోధన, రవాణా రంగాల వారికి కొత్త పరిచయాల వల్ల మేలు జరుగుతుంది.
మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
ఫార్మా, వైద్య రంగాల వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. సహోద్యోగుల ఆం తరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవాల్సి రావచ్చు. ఫైనాన్స్, బీమా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుం ది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. శివారాధన మేలు చేస్తుంది.
- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ