Horoscope : రాశిఫలాలు
ABN , First Publish Date - 2023-08-29T06:58:16+05:30 IST
నేడు (29-8-2023 - మంగళవారం) సింహరాశి వారికి బాగా కలిసొస్తుంది. వీరు గోసేవ చేస్తే ఫలితం మరింత బాగుంటుంది. ఇక మిథునరాశి వారికి విద్యా సంస్థల్లో ప్రవేశానికి అనుకూలంగా ఉంది. అలాగే రక్షణ, న్యాయ, బోధన, రవాణా రంగాల వారికి శుభప్రదం. ఇలా ప్రతి ఒక్క రాశి వారకి బాగానే ఉంది. అయితే కొన్ని రాశుల వారికి మాత్రం సూచనలు చేయడం జరిగింది. వాటిని పాటిస్తే ఫలితం మరింత బాగుంటుంది. ఇక ఆలస్యమెందుకు మీ రాశి ఫలితం ఎలా ఉందో తెలుసుకోండి.
నేడు (29-8-2023 - మంగళవారం) సింహరాశి వారికి బాగా కలిసొస్తుంది. వీరు గోసేవ చేస్తే ఫలితం మరింత బాగుంటుంది. ఇక మిథునరాశి వారికి విద్యా సంస్థల్లో ప్రవేశానికి అనుకూలంగా ఉంది. అలాగే రక్షణ, న్యాయ, బోధన, రవాణా రంగాల వారికి శుభప్రదం. ఇలా ప్రతి ఒక్క రాశి వారకి బాగానే ఉంది. అయితే కొన్ని రాశుల వారికి మాత్రం సూచనలు చేయడం జరిగింది. వాటిని పాటిస్తే ఫలితం మరింత బాగుంటుంది. ఇక ఆలస్యమెందుకు మీ రాశి ఫలితం ఎలా ఉందో తెలుసుకోండి.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక సంస్థలు, యూనియన్ వ్యవహారాల్లో పాల్గొంటారు. బందుమిత్రులతో విందు వినోదాల్లో ఆనందం కలిగిస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త పరిచయాలు లాభిస్తాయి. సంకల్పం నెరవేరుతుంది.
వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ, వ్యాపారాల్లో సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. సంతానం విషయంలో పెద్దలుగా మీ బాధ్యత నిర్వర్తిస్తారు. ప్రభుత్వ సంస్థలతో పనులు పూర్తవుతాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయదర్శనం శుభప్రదం.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
దూరంలో ఉన్న కుటుంబ సభ్యుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విద్యా సంస్థల్లో ప్రవేశానికి అనుకూలం. రక్షణ, న్యాయ, బోధన, రవాణా రంగాల వారికి శుభప్రదం. కటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించండి.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
బీమా, పెన్షన్, డిపాజిట్లకు సంబంధించిన లావాదేవీలు పూర్తవుతాయి. పన్నుల వ్యవహారాలు పరిష్కారమవుతాయి. ఆర్థికపరమైన చర్చలకు అనుకూలం. ఫీజులు, బిల్లులు చెల్లిస్తారు. వైద్యం, సేవల రంగాల వారికి అనుకూలం. సుబ్రహ్మణ్య అష్టక పారాయణ మంచిది.
సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
జనసంబంధాలు విస్తరిస్తాయి. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. షాపింగ్, వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. ప్రేమానుబంధాలు బలపడతాయి. బందుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహరంగా ఉంటుంది. గోసేవ శుభప్రదం.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
వృత్తి, వ్యాపారాల్లో మార్పుల గురించి ఆలోచిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యవసాయం, పరిశ్రమలు, వైద్యం, హోటల్ రంగాల వారు కొత్త ఆలోచనలు అమలు చేస్తారు. ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
ప్రియతములతో చర్చలు, ప్రయాణాలకు అనుకూలం. చిన్నారులకు సంబంధించిన ఒక సమాచారం ఉల్లాసం కలిగిస్తుంది. సినిమాలు, టెలివిజన్, కళలు, క్రీడల రంగాల వారు మంచి ఫలితాలు సాధిస్తారు. విద్యార్థులకు శుభప్రదం. సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని దర్శించండి.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ఆర్థిక వ్యవహారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంటి కోసం విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. ఆర్థిక సమీక్షలకు, సర్దుబాట్లకు అనుకూలం. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు.
ధనుస్పు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. కమ్యూనికేషన్ రంగాల వారికి ప్రోత్సాహ కరంగా ఉంటుంది. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. అగ్రిమెంట్లు, రాతకోతలకు అనుకూలం. మెయిల్స్, సందేశాలు ఉల్లాసం కలిగిస్తాయి.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
పెట్టుబడులకు సంబంధించిన ప్రణాళికలు రూపొందిస్తారు. విలువైన వస్తువుల కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన చర్చలు ఫలిస్తాయి. ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయు.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెట్టుబడులు, పన్నుల, బీమా వ్యవహారాలకు అనుకూలం. మెడికల్ క్లెయిములు మంజూరవుతాయి. మీ లక్ష్య సాధనలో గత అనుభవం తోడ్పడుతుంది. పెన్షన్, గ్రాట్యుటీ, పొదుపు పథకాల వ్యవహారాలు పరిష్కారమవుతాయి.
మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
రాజకీయ, సినీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రియతములతో ప్రయాణాలు, చర్చలు ఆనందం కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో అంచనాలు ఫలిస్తాయి. ఊరేగింపులు, సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు.
- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ