Horoscope : రాశిఫలాలు
ABN , First Publish Date - 2023-09-04T07:47:24+05:30 IST
నేడు (4-9- 2023 - సోమవారం) మేష రాశివారికి వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మిథున రాశి వారు ఇల్లు, స్థల సేకరణ అంశాలపై చర్చిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇక సింహరాశి వారికి అదిరిపోయే న్యూస్. వీళ్లకు నేడు అన్ని విధాలుగా చాలా బాగుంది.
నేడు (4-9- 2023 - సోమవారం) మేష రాశివారికి వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మిథున రాశి వారు ఇల్లు, స్థల సేకరణ అంశాలపై చర్చిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇక సింహరాశి వారికి అదిరిపోయే న్యూస్. వీళ్లకు నేడు అన్ని విధాలుగా చాలా బాగుంది.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వైద్యం, హోటల్, క్యాటరింగ్ రంగాల వారు కొత్త పనులు చేపట్టేందుకు అనుకూల సమయం. విందు వినోదాల్లో పాల్గొంటారు. సన్నిహితుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. సంకల్పం నెరవేరుతుంది.
వృషభం (ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
పొదుపు పథకాలపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. చిన్నారుల విషయాల్లో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. ప్రియతములతో వేడుకల్లో పాల్గొంటారు. కొత్త పరిచయాలు ఏ ర్పడతాయి. టెలివిజన్, క్రీడలు, చిట్‌ఫండ్‌లు, అడ్వర్టయిజ్‌మెంట్ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
ఇల్లు, స్థల సేకరణ అంశాలపై చర్చిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వారసత్వ విషయాలు, కోర్టు వ్యవహారాలు చర్చకు వస్తాయి. దూరంలో ఉన్న కుటుంబ సభ్యులు ఇల్లు చేరుతారు. పరమశివుని ఆరాదన మంచిది.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
చదువుల కోసం అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. సమావేశాలు, చర్చల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. యూనియన్ వ్యవహారాలు, ప్రదర్శనలకు అనుకూలం.
సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉన్నత పదవుల కోసం చే సే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అందుకుంటారు. శివుని ఆలయ దర్శనం మంచిది.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
విద్యార్థులకు శుభప్రదం. ప్రయాణాలు చర్చలకు అనుకూలం. రక్షణ, న్యాయ, బోధన, రవాణా, ఆడిటింగ్ రంగాల వారు పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. వాహనాలు సమకూర్చుకుంటారు. వ్యూహాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. శివారాధన మంచిది.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
బీమా, పన్నులు, మ్యూచ్యువల్ ఫండ్‌ల గురించి ఆరా తీస్తారు. దానధర్మాలకు ఖర్చు చేస్తారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. పెట్టుబడులు లాభిస్తాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. గతంలో చేసిన శ్రమకు ఫలితం అందుకుంటారు. గోసేవలో శుభప్రదం.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
శ్రీవారు, శ్రీమతి వైఖరి ఆనందం కలిగిస్తుంది. సమావేశాల్లో గౌరవ, మర్యాదలు అందుకుంటారు. వేడుకల్లో పాల్గొంటారు. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. శివాలయంలో ప్రదక్షిణలు శుభప్రదం.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
కొత్త పనుల ప్రారంభానికి అనుకూలమైన రోజు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృత్తిపరమైన ఒత్తిళ్లు అధిగమించి లక్ష్యాలు సాధిస్తారు. రుద్రకవచం పారాయణ చేయండి.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
బోధన, బ్యాంకింగ్, ప్రకటనల రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకంగా ఉంటుంది. బంధుమిత్రులతో ఉి్లాసంగా గడుపుతారు. ఆర్థిక విషయాల్లో ప్రియతముల సహకారం లభిస్తుంది. విద్యార్థులకు శుభప్రదం. సంతానం విషయంలో శుభపరిణామాలు జరుగుతాయి. గోసేవ శుభప్రదం.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
ఇల్లు, స్థల సేకరణకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. అద్దె నిర్ణయాలకు అనుకూలమైన రోజు. కుటుంబ సభ్యుల ఆ రోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. గృహరుణాలు మంజూరవుతాయి. ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
బంధుమిత్రుల కలయిక ఉల్లాసం కలిగిస్తుంది. విద్యార్థులు పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. ప్రయాణాలు, చర్చలు, విద్యా విషయాల్లో అంచనాలు ఫలిస్తాయి. భాగస్వామి విషయంలో అభివృద్ది కనిపిస్తుంది. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం.
- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ