కొత్త కారు అమ్మితే షోరూమ్ యజమానికి ఎంత లాభం వస్తుంది?... మతి పోగొట్టే షోరూమ్ లెక్కలివే..!

ABN , First Publish Date - 2023-04-09T13:35:28+05:30 IST

ఏదైనా కారు విక్రయించినప్పుడు దాని ఎక్స్ షోరూమ్ ప్రైజ్(Ex showroom price) విడిగా ఉంటుంది. ట్యాక్సులు మొదలైనవి వేశాక ఆన్ రోడ్ ప్రైజ్ మరో విధంగా ఉంటుంది.

కొత్త కారు అమ్మితే షోరూమ్ యజమానికి ఎంత లాభం వస్తుంది?... మతి పోగొట్టే షోరూమ్ లెక్కలివే..!

ఏదైనా కారు విక్రయించినప్పుడు దాని ఎక్స్ షోరూమ్ ప్రైజ్(Ex showroom price) విడిగా ఉంటుంది. ట్యాక్సులు మొదలైనవి వేశాక ఆన్ రోడ్ ప్రైజ్ మరో విధంగా ఉంటుంది. ఒక కారు విక్రయిస్తే డీలర్‌కు ఎంత లాభం చేకూరుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి సంబంధించి ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్(Federation of Automobile Dealers Association) కొన్ని వివరాలు అందించింది.

దానిప్రకారం ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో డీలర్ మార్జిన్(Dealer Margin) తక్కువగా ఉంటుంది. మన దేశంలోని డీలర్లు కార్ల విక్రయంలో 5 శాతం కంటే తక్కువ మార్జిన్ పొందుతారు. అంటే కారును విక్రయించినప్పుడు డీలర్ 5 శాతం మేరకు లాభం పొందుతాడు. ఇది ప్రతి కంపెనీ, కారు సెగ్మెంట్(segment) లేదా ప్రాంతంపై ఆధారపడి ఉంటుంది. భారతదేశంలోని డీలర్లకు ఎంజీ మోటార్స్(MG Motors), మారుతి సుజుకి అత్యధిక మార్జిన్‌ను అందిస్తున్నాయని పలు రిపోర్టులు తెలియజేస్తున్నాయి.

ఈ కంపెనీలు దాదాపు 5 శాతం లేదా అంతకంటే ఎక్కువ కమీషన్ ఇస్తాయి. మరికొన్ని కంపెనీలు చాలా తక్కువ మార్జిన్ ఇస్తున్నాయి. కారు తయారయ్యే దేశం ఆధారంగానూ లాభ శాతాన్ని నిర్ణయిస్తారు. కారు కొనుగోలు చేసేటప్పుడు రోడ్డు ట్యాక్స్(Road Tax), జీఎస్టీ, కారు ధరపై సెస్ చెల్లించాలి. ఈ పన్ను కూడా ఒక్కో సెగ్మెంట్‌(segment)కు భిన్నంగా ఉంటుంది.

Raashi Khanna: గులాబీ డ్రస్‌లో గ్లామర్ షోతో కవ్విస్తోన్న రాశీ ఖన్నా..!

Updated Date - 2023-04-10T09:05:53+05:30 IST