lion facts: నిజానికి సింహం సింగిల్‌గా వస్తుందా?... అది రోజుకు ఎంత ఆహారం తింటుందో తెలిస్తే...
ABN , First Publish Date - 2023-03-11T09:16:12+05:30 IST
lion facts: సింహాన్ని అడవికి రారాజు(King of the jungle) అని అంటారు. అది అడవికి రారాజు అయినందున ఎక్కువ ఆహారం(food) తీసుకుంటుందని చాలామంది భావిస్తారు. నిజానికి సింహం ఒక రోజులో ఎంత మాంసం(meat) తింటుందో తెలుసా?
lion facts: సింహాన్ని అడవికి రారాజు(King of the jungle) అని అంటారు. అది అడవికి రారాజు అయినందున ఎక్కువ ఆహారం(food) తీసుకుంటుందని చాలామంది భావిస్తారు. నిజానికి సింహం ఒక రోజులో ఎంత మాంసం(meat) తింటుందో తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఒక పరిశోధన ప్రకారం సింహం ఆహారం తీసుకున్నతరువాత చాలా రోజులు(Many days) తినకుండా జీవించగలదని తేలింది. సగటున సింహాలు తమ శరీర బరువులో 4 నుంచి 6% వరకు సమతూగే ఆహారం తీసుకుంటాయి. కొన్నిసార్లు అవి తమ బరువు(weight)కు మించి ఆహారం తినడానికి ఇష్టపడతాయి.
సింహం ఒక రోజులో సగటున 7 కిలోల మాంసాన్ని తింటుంది. భారతదేశంలోని జూ పార్కు(Zoo Park)లలోని జంతువులపై జరిపిన పరిశోధన ప్రకారం ఒక సింహం లేదా పులి ఒక రోజులో 10 నుండి 14 కిలోల మాంసాన్ని తింటుంది. చిరుతపులి.. సింహం కంటే కొంచెం తక్కువ మాంసాన్ని తింటుంది. అంటే 4 నుండి 5 కిలోలు తింటుందన్నమాట.
మరోవైపు వేసవి కాలం(summer season)లో సింహం ఆహారంలో 20 శాతం తగ్గుదల కనిపిస్తుంది. సింహం తాను సులభంగా వేటాడగలిగే ప్రతి జంతువును తింటుంది. సింహం వేటాడే జంతువులలో ముఖ్యంగా గేదె, జీబ్రా, జిరాఫీ, వైల్డ్‌బీస్ట్ కనిపిస్తాయి. ఒక్కోసారి సింహాలు భారీ జంతువులను కూడా వేటాడతాయి. సింహం కొన్నిసార్లు పండ్లు(fruits) కూడా తింటుంది. సింహం అరుదైన సందర్భాల్లో మొసలి(crocodile)ని కూడా వేటాడుతుంది.
సింహం గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు
1- సింహం మాంసాహార జంతువైనప్పటికీ, అది గడ్డి భూముల్లో(grasslands) నివసించడానికి ఇష్టపడుతుంది.
2- సింహాలు మాంసం తిన్న తర్వాత చాలాసేపు నిద్రపోతాయి.
3- సింహాలు ఎల్లప్పుడూ గుంపులు(groups)గా వేటాటడం కనిపిస్తుంది.
4- సింహాలు భారతదేశం(India)లో అధికంగా కనిపిస్తాయి.
5- సింహం గంటకు 80 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలదు.