Aadhaar Card: 5 ఏళ్ల లోపు పిల్లలకు ఆధార్ కార్డు ఎలా..? ఈ 8 సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే..!

ABN , First Publish Date - 2023-09-15T20:03:14+05:30 IST

5 ఏళ్ల లోపు చిన్నారుల కోసం ఆధార్ కార్డు దరఖాస్తు చేసుకుంటున్నారా? ఈ 8 సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే సులువుగా ఆధార్ కార్డు పొందొచ్చు.

Aadhaar Card: 5 ఏళ్ల లోపు పిల్లలకు ఆధార్ కార్డు ఎలా..? ఈ 8 సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే..!

ఇంటర్నెట్ డెస్క్: ఆధార్ కార్డు.. భారత్‌లోని ప్రతి పౌరుడి వద్ద ఉండాల్సిన గుర్తింపు డాక్యుమెంట్లలో ఇది ప్రధానమైదని. దరఖాస్తు చేసుకున్న ప్రతి పౌరుడికి 12 అంకెల ప్రత్యేక సంఖ్యతో ఈ కార్డు జారీ అవుతుంది. ప్రత్యేక గుర్తింపు ప్రాథికార సంస్థ దీన్ని జారీ చేస్తుంది.

ప్రస్తుతం ఆధార్ కార్డును పెద్దలే అధికంగా వినియోగించినా పిల్లలకు కూడా ప్రభుత్వం ఈ కార్డును జారీ చేస్తుంది. కాబట్టి, మీ పిల్లలకు కూడా ఆధార్ కార్డు కావాలంటే ఈ 8 సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది(Aadhar enrollment for kids below 5 years of age).

పిల్లలకు ఆధార్ కోసం..

  • ముందుగా స్థానిక ఆధార్ నమోదు కేంద్రాన్ని సందర్శించాలి.

  • అక్కడ ఆధార్ కార్డు దరఖాస్తులో చిన్నారులు, వారి తల్లిదండ్రుల వివరాలను నింపాలి.

  • ఐదేళ్లలోపు చిన్నారులకు ఆధార్ కార్డు కోసం తల్లి, లేదా తండ్రి వివరాలు నమోదు చేస్తే సరిపోతుంది.

  • ఆధార్ కార్డు కేంద్రంలోని సిబ్బంది చిన్నారి ఫొటోను తీసుకుంటారు.

  • అనంతరం చిన్నారి అడ్రస్, వయసు, పేరు, తదితర వివరాలను తల్లి, లేదా తండ్రి ఆధార్ కార్డు ఆధారంగా నమోదు చేసుకుంటారు.

  • ఆధార్ కార్డు కోసం బర్త్ సర్టిఫికేట్ లేదా బిడ్డ పుట్టాక ఆసుపత్రి నుంచి వచ్చే సమయంలో ఇచ్చే డిశ్చార్జ్ సర్టిఫికేట్ కావాలి.

  • అన్ని వివరాలు నమోదు చేసుకున్నాక ఆధార్ కేంద్రం సిబ్బంది తమకు చిన్నారి నుంచి దరఖాస్తు అందినట్టు ధ్రువీకరిస్తూ ఓ ఎక్నాలెడ్జ్‌మెంట్ రిసీట్‌ను ఇస్తారు.

  • ఎక్నాలెడ్జ్‌మెంట్ రిసీట్‌‌‌లోని నెంబర్ ఆధారంగా ఆధార్ కార్డు జారీ అయ్యిందో లేదో తెలుసుకోవచ్చు.

దీంతో, పిల్లల కోసం ఆధార్ దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. ఆధార్ కార్డు జారీ అయ్యాక దాని డిజిటల్ కాపీని ఆన్‌లైన్‌ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ప్రస్తుత నిబంధనల ప్రకారం..ఐదేళ్ల లోపు చిన్నారుల బయోమెట్రిక్ డాటాను తీసుకోరు. ఐదేళ్లు దాటిన చిన్నారుల విషయంలో మాత్రం ఈ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాదు, చిన్నారికి 15 ఏళ్లు నిండాక ఈ బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.

Updated Date - 2023-09-15T20:07:41+05:30 IST