WhatsApp: వాట్సాప్‌లో మీ నెంబర్‌ను బ్లాక్ చేశారని తెలుసుకోవడం ఎలా..? మెసేజ్ పంపినా ఇలా కనిపిస్తే బ్లాక్ చేసినట్టే లెక్క..!

ABN , First Publish Date - 2023-09-19T17:07:24+05:30 IST

ప్రస్తుత స్మార్ట్‌ఫోన్ యుగంలో అందరి జీవితాల్లోనూ సోషల్ మీడియా అనేది కీలక భాగమైపోయింది. ముఖ్యంగా వాట్సాప్ అనేది అతి ముఖ్యమైపోయింది. ప్రస్తుతం వ్యక్తిగత, ఉద్యోగ జీవితాల్లో వాట్సాప్ లేకుండా పనులు జరగడం లేదు. వాట్సాప్‌ ద్వారా కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కనెక్ట్ అవ్వడం సులభం అయింది.

WhatsApp: వాట్సాప్‌లో మీ నెంబర్‌ను బ్లాక్ చేశారని తెలుసుకోవడం ఎలా..? మెసేజ్ పంపినా ఇలా కనిపిస్తే బ్లాక్ చేసినట్టే లెక్క..!

ప్రస్తుత స్మార్ట్‌ఫోన్ (Smart Phones) యుగంలో అందరి జీవితాల్లోనూ సోషల్ మీడియా అనేది కీలక భాగమైపోయింది. ముఖ్యంగా వాట్సాప్ (WhatsApp) అనేది అతి ముఖ్యమైపోయింది. ప్రస్తుతం వ్యక్తిగత, ఉద్యోగ జీవితాల్లో వాట్సాప్ లేకుండా పనులు జరగడం లేదు. వాట్సాప్‌ ద్వారా కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కనెక్ట్ అవ్వడం సులభం అయింది. వాట్సాప్ గ్రూప్స్ సహాయంతో కాలేజీ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరితో టచ్‌లో ఉండొచ్చు. అందరితోనూ ఒకేసారి ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోవచ్చు (WhatsApp Tricks).

వాట్సాప్‌లో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ (Blocked in WhatsApp) చేస్తే ఆ సమాచారం మీకు తెలియదు. అయితే కొన్ని ట్రిక్స్ ద్వారా ఎవరెవరు మిమ్మల్ని బ్లాక్ చేశారో సులభంగా తెలుసుకోవచ్చు. మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేస్తే చాట్ విండోలో లాస్ట్ సీన్ (Last Seen) కనబడదు. అలాగే ఆ వ్యక్తి ఆన్‌లైన్‌లో (Online) ఉన్నారో, లేదో వంటివి మీకు తెలియదు. అలాగే మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తి లేటెస్ట్ ప్రొఫైల్ ఫొటో (Profile Photo) మీకు కనబడదు. అలాగే మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తికి మెసేజ్ చేస్తే కేవలం ఒక్క టిక్ మార్క్ మాత్రమే వస్తుంది. రెండు టిక్ మార్కులు ఎప్పటికీ రావు.

Fridge: ఇంట్లో వాడే ఫ్రిడ్జ్.. ఎక్కువ కాలం పనిచేయాలంటే.. ఈ మిస్టేక్ మాత్రం పొరపాటున కూడా చేయకండి..!

అలాగే మిమ్మల్ని బ్లాక్ చేసిన యూజర్‌కు మీరు ఎప్పటికీ వాట్సాప్ కాల్ చేయలేరు. పైన చెప్పిన అన్నీ సూచనలు కనిపిస్తున్నా ఆ వ్యక్తి మిమ్మల్ని బ్లాక్ చేసినట్టు అర్థం చేసుకోవాలి. అలాగని పూర్తిగా నిర్ధారించుకోలేం. ఎందుకంటే సదరు వ్యక్తి తన వాట్సాప్ సెట్టింగ్స్‌లో ప్రైవసీ సెట్టింగ్స్‌లో పైన పేర్కొన్న సెట్టింగ్స్ కూడా పెట్టుకుని ఉండొచ్చు.

Updated Date - 2023-09-19T17:07:24+05:30 IST