IPL 2023: ఐపీఎల్‌లో సఫారీల హవా.. అందరూ మ్యాచ్ విన్నర్లే.. కానీ, అభిమానులకు మాత్రం నిరాశే..
ABN , First Publish Date - 2023-04-04T14:14:52+05:30 IST
గత శుక్రవారం ప్రారంభమైన ఐపీఎల్ (IPL 2023) క్రికెట్ ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే లీగ్‌లోని అన్ని జట్లూ తమ తొలి మ్యాచ్‌ను ఆడేశాయి. ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో టోర్నీని రసవత్తరంగా మార్చేశారు.
గత శుక్రవారం ప్రారంభమైన ఐపీఎల్ (IPL 2023) క్రికెట్ ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే లీగ్‌లోని అన్ని జట్లూ తమ తొలి మ్యాచ్‌లను ఆడేశాయి. ఆటగాళ్లు తమ అద్భుత ప్రదర్శనతో టోర్నీని రసవత్తరంగా మార్చేశారు. తాజాగా దక్షిణాఫ్రికా ఆటగాళ్లు (Sourth Africans) కూడా రంగ ప్రవేశం చేశారు. ఐదెన్ మార్క్‌రమ్ (Aiden Markram), డేవిడ్ మిల్లర్ (David Miller), రబాడా (Kagiso Rabada), డికాక్ (Quinton de Kock) ఇంకా ఇతర ఆటగాళ్లు ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యారు. నెదర్లాండ్స్‌తో దక్షిణాఫ్రికా జట్టు వన్డే సిరీస్ ఆడుతుండడమే దానికి కారణం.
ఆదివారంతో ముగిసిన ఆ రెండు వన్డేల సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-0తో గెలుచుకుంది. ఇక, ఆటగాళ్లందరూ ఐపీఎల్ కోసం భారత్‌కు చేరుకున్నారు. వీరి రాకతో ఆయా జట్లు మరింత బలపడనున్నాయి. సన్‌రైజర్స్ జట్టుకు ఐదెన్ మార్క్‌రమ్, గుజరాత్‌కు డేవిడ్ మిల్లర్, పంజాబ్‌కు రబాడా, లక్నోకు డికాక్ కీలక ఆటగాళ్లు. వీరి రాకతో ఆయా జట్లు మరింతగా బలపడతాయి. వీరు మాత్రమే కాదు.. దక్షిణాఫ్రికాకు చెందిన ఎంతో మంది ఆటగాళ్లు ఐపీఎల్‌లో సందడి చేస్తున్నారు.
Rishab Pant Jersey: డగౌట్‌పై రిషబ్ పంత్ జెర్సీ.. ఢిల్లీ టీమ్‌పై బీసీసీఐ ఆగ్రహం.. కారణమేంటంటే..
దాదాపు 15 మంది సఫారీ ఆటగాళ్లు ఈ ఐపీఎల్‌లో వివిధ టీమ్‌ల తరఫున ఆడుతున్నారు. అయితే, ఈ ఐపీఎల్‌ను చూసే అవకాశం మాత్రం దక్షిణాఫ్రికా క్రికెట్ అభిమానులకు లేదు. ఎందుకంటే దక్షిణాఫ్రికాలో క్రికెట్ మ్యాచ్‌లను ప్రసారం చేసే టీవీ సంస్థ ``సూపర్ స్పోర్ట్``కు (SuperSport) ఈ ఏడాది ఐపీఎల్ హక్కులు దక్కలేదు. దాదాపు పదిహేనుళ్లుగా ఐపీఎల్‌ను దక్షిణాఫ్రికాలో ``సూపర్ స్పోర్ట్`` ఛానెల్ ప్రసారం చేస్తోంది. ఈ ఏడాది మాత్రం ఆ సంస్థకు హక్కులు దక్కలేదు.