Wife-Husband: భార్యతో కలిసి ఓ భర్త మందు పార్టీ.. ఇద్దరూ కలిసి పెగ్గుల మీద పెగ్గులు.. తెల్లారేసరికి ఆమెను ఎందుకు చంపేశాడంటే..!
ABN , First Publish Date - 2023-10-17T20:38:02+05:30 IST
ఓ కుటుంబంలో మద్యం పూడ్చలేని అగాధాన్ని మిగిల్చింది. ఆ రాత్రి భార్యభర్తలు మందు పార్టీ చేసుకోగా తెల్లారేసరికల్లా భార్య శవమై తేలింది. ఝార్ఖండ్లో ఈ ఘటన వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఓ కుటుంబంలో మద్యం పూడ్చలేని అగాధాన్ని మిగిల్చింది. ఆ రాత్రి భార్యభర్తలు మందు పార్టీ చేసుకోగా తెల్లారేసరికల్లా భార్య శవమై తేలింది. ఝార్ఖండ్లో(Jharkhand) ఈ ఘటన వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే, డుమ్కా జిల్లా జామా పోలీస్ స్టేషన్ పరిధిలోని జల్ఝోకా గ్రామానికి చెందిన ఓ దంపతులు బుధవారం మద్యం పార్టీ చేసుకున్నారు.
ఇద్దరూ ఆ రాత్రి పూటుగా మద్యం తాగారు. తొలుత వారి మధ్య సరదాగా మొదలైన సంభాషణ చూస్తుండగానే అనూహ్య మలుపు తిరిగింది. మద్యం మత్తులో ఉన్న భర్త తొలుత భార్యను ఏదైనా వండి తీసుకురమ్మన్నాడు. కానీ భార్య మాత్రం కుదరదని ముఖం మీదే తెగేసి చెప్పింది. దీంతో, ఇద్దరి మధ్య పెద్ద వాగ్యుద్ధం మొదలైంది.భార్య ఎదురు చెప్పడంతో తిక్కరేగిన అతడు ఆమెపై దాడి చేశాడు.
Viral: Viral: ఇలాంటి కోతి భూప్రపంచంలో మరోటి ఉండదేమో? తాసీల్దార్ ఆఫీసులోకి ఫైళ్లు కనిపించగానే..
చివరకు విచక్షణ కోల్పోయి కత్తితో ఆమె పీక కోసి హత్య చేశాడు (Husband murders wife under influence of alcohol). తీవ్ర మైకంలో ఉన్న అతడు తన చేసిన దారుణాన్ని కూడా గుర్తించలేకపోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న భార్య మృతదేహం పక్కనే నిద్రించాడు. ఆ మరుసటి రోజు ఇంటికి వచ్చిన కుమారుడికి తల్లిరక్తపు మడుగులో పడి ఉండటం చూసి నిశ్చేష్టుడయ్యాడు. చివరకు ఇరుగుపొరుగు వారికి చెప్పాడు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Viral: రోడ్డుపై అడ్డంగా పాము..దాని పడగకు తగిలేలా తూపాకీతో కాల్చిన వ్యక్తి.. గురి తప్పడంతో..
Viral: ఇంటి పనుల్లో భార్యకు సాయం చేయనన్న వ్యక్తిపై ప్రశంసల వర్షం.. ఇతడి లాజిక్కు జనాలు ఫిదా!