Fridge: ఇంట్లో వాడే ఫ్రిడ్జ్.. ఎక్కువ కాలం పనిచేయాలంటే.. ఈ మిస్టేక్ మాత్రం పొరపాటున కూడా చేయకండి..!

ABN , First Publish Date - 2023-09-19T16:44:39+05:30 IST

గత కొన్ని దశాబ్దాలుగా ఇళ్లలో ఎలక్ట్రానిక్ వస్తువులు వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఎలాంటి శ్రమా లేకుండా జీవితాన్ని సులభతరం చేసే మిక్సీ, గ్రైండర్, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ వంటి ఉపకరణాలను అందరూ వాడుతున్నారు. ముఖ్యంగా ఫ్రిడ్జ్‌ను వాడని వారు చాలా అరుదుగా కనిపిస్తుంటారు.

Fridge: ఇంట్లో వాడే ఫ్రిడ్జ్.. ఎక్కువ కాలం పనిచేయాలంటే.. ఈ మిస్టేక్ మాత్రం పొరపాటున కూడా చేయకండి..!

గత కొన్ని దశాబ్దాలుగా ఇళ్లలో ఎలక్ట్రానిక్ వస్తువులు వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఎలాంటి శ్రమా లేకుండా జీవితాన్ని సులభతరం చేసే మిక్సీ, గ్రైండర్, ఫ్రిడ్జ్ (Fridge), వాషింగ్ మెషిన్ (Washing Machine) వంటి ఉపకరణాలను అందరూ వాడుతున్నారు. ముఖ్యంగా ఫ్రిడ్జ్‌ను వాడని వారు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. వంటగదిలో ఫ్రిడ్జ్ అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఫ్రిడ్జ్ గురించి పూర్తిగా తెలుసుకుని ఉపయోగిస్తే ఎంతో కాలం పని చేస్తుంది. లేకపోతే మాటిమాటికీ పాడైపోయి జేబుకు చిల్లు పెడుతుంది. ఈ నేపథ్యంలో ఫ్రిడ్జ్ ఎక్కువ కాలం పనిచేసేందుకు అవసరమైన చిట్కాల గురించి తెలుసుకుందాం (Kitchen Hacks).

అన్నింటి కంటే ముందుగా ఫ్రిడ్జ్ శుభ్రతపై (Fridge Cleaning) దృష్టి సారించాలి. ఫ్రిడ్జ్‌ని క్రమం తప్పకుండా శుభ్రం చేస్తే దాని ఆయుష్షు పెరుగుతుంది. అలాగే దాని పనితీరు కూడా అద్భుతంగా ఉంటుంది. ఇక, రిఫ్రిజిరేటర్‌లో అతి ముఖ్యమైన భాగం కంప్రెసర్. కంప్రెసర్ బాగా ఉంటే కూలింగ్ అద్భుతంగా ఉంటుంది. కంప్రెసర్ ఎక్కువ కాలం బాగా పని చేయాలంటే ఫ్రిడ్జ్‌ను మంచి వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో ఉంచాలి. కంప్రెషర్ కనుక పాడైతే దాని కోసం భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది.

Indian Railway: ఆ లోకో పైలెట్లకు నైట్ డ్యూటీ ఎందుకు ఉండదు..? భారతీయ రైల్వే పాటిస్తున్న ఈ రూల్ గురించి మీకు తెలుసా..?

ఇక, రిఫ్రిజిరేటర్ లోపల ప్రతి షెల్ఫ్‌ను పలు వస్తువుల కోసం రూపొందించారు. అందువల్ల ఫ్రిడ్జ్‌లో వస్తువులను సరైన స్థలంలో ఉంచడం చాలా ముఖ్యం. ఫ్రిడ్జ్ డోర్ షెల్ఫ్‌లలో ఎట్టి పరిస్థితుల్లోనూ పాలు, పళ్ల రసాలు వంటివి ఉంచకూడదు. ఎందుకంటే ఫ్రిడ్జ్ లోపలి భాగంలో వేడిగా ఉండేది డోర్ మాత్రమే. ఉష్ణోగ్రతల హెచ్చు తగ్గుల వల్ల పాలు, పళ్ల రసాలు మొదలైనవి పాడైపోతాయి. అందకే అక్కడ నీళ్లు, సోడా, కెచప్ వంటివి మాత్రమే ఉంచాలి. అలాగే ఫ్రిడ్జ్‌ డోర్‌ను ఎక్కువ సార్లు తెరిస్తే కంప్రెసర్ మీద ఎక్కువ భారం పడుతుంది. అందువల్ల కరెంట్ బిల్లు కూడా ఎక్కువగా వస్తుంది.

Updated Date - 2023-09-19T16:44:39+05:30 IST