Independence Day: జాతీయ జెండాతో జర జాగ్రత్త.. ఈ మిస్టేక్స్ కనుక చేస్తే జైలుకెళ్లడం ఖాయం..!

ABN , First Publish Date - 2023-08-14T12:57:52+05:30 IST

ఏటా స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు కాగితాలు, ప్లాస్టిక్ తో తయారుచేసిన జెండాలు కొన్ని కోట్ల కొద్దీ తయారవుతాయి, అమ్ముడవుతాయి. కానీ చాలా మంది జెండా గురించి ఈ విషయాలేవీ తెలుసుకోకుండా కొనుగోలు చేస్తారు.

Independence Day: జాతీయ జెండాతో జర జాగ్రత్త.. ఈ మిస్టేక్స్ కనుక చేస్తే జైలుకెళ్లడం ఖాయం..!

ఏడాదిలో అన్ని నెలల గురించి పక్కన పెడితే ఆగస్టుకు చాలా ప్రత్యేకత ఉంది. దేశానికి స్వాతంత్య్రం రావడమే ఇందుకు ప్రధాన కారణం. ప్రతి ఏడు ఆగస్టు 15వ తేదీన భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోవడం పరిపాటి. ఇందుకోసం చిన్నా పెద్ద తేడాలేకుండా జండాలు కొనుగోలు చేస్తారు. కాగితాలు, ప్లాస్టిక్ తో తయారుచేసిన జెండాలు కొన్ని కోట్ల కొద్దీ తయారవుతాయి, అమ్ముడవుతాయి. వీటిని కొనుగోలు చేసేవరకు సరే కానీ, ఆ తరువాత ఈ జెండాలు రహదారుల మీదా, చెత్తబుట్టల దగ్గరా దర్శనమిస్తుంటాయి. ఎంతో గౌరవించాల్సిన జెండాను ఇలా ఎవరైనా చెత్తబుట్టలో కానీ, రహదారులమీద కానీ ఇష్టానుసారంగా పారేయడం చట్టరీత్యానేరం. అసలు జెండా విషయంలో చేయకూడని తప్పులేంటి? డ్యామేజ్ అయిన జెండాను ఏం చెయ్యాలి? జెండాను ఎక్కడైనా పారేస్తూ పొరపాటున పోలీసుల కంటబడితే జరిగేదేంటి? ఈ విషయాలు తెలుసుకున్న తరువాతే జెండా కొనుగోలు చేయడం మంచిది.

చాలామంది తెలిసీ తెలియక జెండా విషయంలో తప్పులు చేస్తుంటారు. ఒకరోజు దేశభక్తులు జెండాలు పట్టుకుని సెల్ఫీలు దిగి, కాసిన్ని దేశభక్తి రీల్స్ చేసి ఆ తరువాత జెండాను పారేస్తుంటారు. పొరపాటున ఇలా ఎవరైనా జెండాను రహదారుల మీద, చెత్తబుట్టలలో పడేస్తుంటే అది జాతీయ జెండాను అగౌరవపరిచినట్టు అవుతుంది. దీనికి మూడేళ్ళ జైలు శిక్ష, జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ సమస్య ఉండకూడదని అనుకుంటే ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా(Flag code of India 2002) గురించి తెలుసుకోవాలి. 2002 సంవత్సరంలో ఇండియన్ ఫ్లాగ్ కోడ్ ప్రవేశపెట్టబడింది. దీనిప్రకారం జెండా పాడైతే దాన్ని రెండువిధాలుగా పారేయచ్చు. వీటిలో ఒకటి జెండాను పాతిపెట్టడం, రెండవది జెండాను దహనం చేయడం. ఈ రెండింటికి కూడా నిబంధనలు ఉన్నాయి.

Papaya Seeds: అమ్మ బాబోయ్.. బొప్పాయి గింజలతో ఇన్ని లాభాలా..? తెలియక ఎన్ని సార్లు పారేసి ఉంటారో..!



పాడైపోయిన జెండాను పాతిపెట్టడానికి మొదట పాడైన జెండాలను సేకరించాలి. వీటన్నింటిని మడతపెట్టి ఒక చెక్కపెట్టెలో ఉంచాలి. ఈ చెక్కపెట్టెను భూమిలో పాతిపెట్టాలి. ఆ తరువాత కొద్ది నిమిషాల పాటు మౌనం పాటించాలి. చెక్కపెట్టెలో కాకుండా జెండాను నేరుగా భూమిలో పాతిపెట్టడం చట్టరీత్యా నేరం.

జెండాను భూమిలో పాతిపెట్టడమే కాకుండా దహనం కూడా చేయవచ్చు. దీనిప్రకారం జెండా దహనానికి శుభ్రమైన ప్రాంతాన్ని ఎంచుకోవాలి. అక్కడ మంట వేయాలి. జెండాలను సరిగ్గా మడతపెట్టి మండుతున్న అగ్ని మధ్యలో ఉంచాలి. జెండాను దహనం చేసేటప్పుడు దాని చివరల నుండి అగ్గిలో కాల్చడం చట్టరీత్యా నేరం. సగౌరవంగా మడతపెట్టి మరీ దహనం చేయాలి. జెండాలను పాతిపెట్టినా, దహనం చేసినా ఒక వీరుడికి ఎలా అయితే అంతిమవీడ్కోలు చెబుతారో అలాగే జెండాకు చెప్పాలి. జాతీయ జెండాలను ఏ ప్రదేశాల్లోనూ అలంకరణ కోసం ఉపయోగించకూడదు. త్రివర్ణపతాకంతో దేన్నీ కవర్ చేయడానికి ఉపయోగించకూడదు. హ్యాండ్ కర్చీప్ లు, లోదుస్తులు వంటి వాటిపై జాతీయ జెండాను ముద్రించకూడదు, అలాంటివి క్రియేట్ చేసి వాడకూడదు. త్రివర్ణపతాకాన్ని నడుముకింద ధరించే ఎలాంటి దుస్తులపైనా రూపొందించకూడదు.

Apple: యాపిల్స్‌ను కట్ చేయగానే.. నిమిషాల్లోనే రంగు మారిపోతున్నాయా..? మీరు చేయాల్సిన పనేంటంటే..!


Updated Date - 2023-08-14T13:04:00+05:30 IST