is urine good for health: మూత్రం తాగితే ఆరోగ్యం మెరుగుపడుతుందా?.... అందరూ ఛీకొట్టే ఈ వాదనలో నిజానిజాలేమిటో తెలిస్తే...

ABN , First Publish Date - 2023-03-15T10:44:24+05:30 IST

is urine good for health: పండ్ల రసం(fruit juice) తాగడం వల్ల శక్తి వస్తుందని వైద్యులు చెబుతుంటారు. అయితే ఇప్పుడు తాజాగా మూత్రం(urine) తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని కొందరు అంటున్నారు.

is urine good for health: మూత్రం తాగితే ఆరోగ్యం మెరుగుపడుతుందా?.... అందరూ ఛీకొట్టే ఈ వాదనలో నిజానిజాలేమిటో తెలిస్తే...

is urine good for health: పండ్ల రసం(fruit juice) తాగడం వల్ల శక్తి వస్తుందని వైద్యులు చెబుతుంటారు. అయితే ఇప్పుడు తాజాగా మూత్రం(urine) తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని కొందరు అంటున్నారు. అవును.. మూత్రం తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని తెలియజేసే అనేక నివేదికలు ఇంటర్నెట్‌(Internet)లో దర్శనమిస్తున్నాయి. చర్మ సంబంధిత వ్యాధుల నుంచి మలబద్ధకం(Constipation) వరకు పలు రకాల వ్యాధులను మూత్రం దూరం చేస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

అయితే దీని వెనుక ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు(Scientific evidence) లేవని, అలా చేయడం వల్ల ఆరోగ్యానికి మరింత హాని కలుగుతుందని చాలా మంది వాదిస్తున్నారు. అయితే యూరిన్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాల(benefits) గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. చైనా(China)లోని ప్రజలు తమ మూత్రాన్ని తామే తాగుతారు. దీనితో పాటు వారు తమ కళ్ళు, ముఖాన్ని కూడా మూత్రంతో శుభ్రపరుచుకుంటారు. ఇలా చేయడం వలన ముఖంలో మెరుపుదనం వస్తుందని, దృష్టి మెరుగుపడుతుందని వారు నమ్ముతుంటారు.

యూరిన్ ట్రీట్‌మెంట్‌(Urine treatment)లోని వివరాల ప్రకారం మూత్రం అనేది బరువును తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. చైనాలో కొంతమంది టీ మాదిరిగానే మూత్రాన్ని తాగుతారు. మూత్రాన్ని కంటి చుక్కలుగా కూడా ఉపయోగిస్తారు. హెల్త్‌లైన్ నివేదిక ప్రకారం మూత్రం తాగడం అనేది చాలా కాలంగా కొనసాగుతోంది. ఈ ప్రక్రియ(process)ను యూరోఫాగియా లేదా యూరోథెరపీ(Urotherapy) అని పిలుస్తారు, పురాతన రోమ్, గ్రీస్, ఈజిప్ట్ నాటి కాలానికి సంబంధించిన అనేక నివేదికలలో మొటిమల నుండి క్యాన్సర్(Cancer) వరకు అన్నింటికీ చికిత్స చేయడానికి యూరిన్ థెరపీని ఉపయోగించినట్లు పేర్కొన్నారు. ఒకప్పుడు వైద్యులు మూత్రంలో మధుమేహాన్ని(Diabetes) పరీక్షించేవారు.

కాగా మూత్రం తాగడం సానుకూలమని చెప్పే శాస్త్రీయ ఆధారాలు(Scientific evidence) చాలా తక్కువ. వైద్య శాస్త్రం ఆధారిత నివేదికల ప్రకారం చూస్తే.. బ్యాక్టీరియా(Bacteria), టాక్సిన్స్, ఇతర హానికరమైన పదార్థాలు మూత్రం తాగడం ద్వారా రక్తంలోకి ప్రవేశిస్తాయి. మన శరీరం నుండి విడుదలయ్యే వ్యర్థ పదార్థం. బ్యాక్టీరియాతో మూత్రం కలుషితమవుతుంది. ఈ బ్యాక్టీరియా శరీరం లోపలికి వెళ్ళిన తర్వాత తీవ్రమైన వ్యాధులను(Serious diseases) కలిగిస్తుంది. ఇది కిడ్నీపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. మూత్ర చికిత్స చాలా పురాతనమైన చికిత్సగా పేర్కొంటారు.

నాటిరోజుల్లో మూత్రాన్ని ఔషధం(medicine)గా ఉపయోగించేవారు. మూత్రంలో మినరల్స్, యాంటీబాడీస్, ఎంజైమ్‌లు, హార్మోన్లు ఉన్నాయని, ఇది మన ముఖంపై మచ్చలను తొలగిస్తుందని నమ్ముతుంటారు. మూత్రం యాంటిసెప్టిక్‌(Antiseptic)గా కూడా పని చేస్తుందని చెబుతారు.

Updated Date - 2023-03-15T10:50:16+05:30 IST