ISRO: ఇస్రో కష్టం ఈనాటిది కాదు.. ఈ 10 ఫోటోలు చూస్తే గూస్ బంప్స్ వస్తాయ్..

ABN , First Publish Date - 2023-08-27T13:37:13+05:30 IST

భారతదేశం చంద్రయాన్-3 విజయంతో తన సత్తా చాటింది. అయితే ఈ విజయం ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. ఇస్రో కష్టం ఈనాటిది కాదు. దానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ 10ఫోటోలే సాక్ష్యం.

 ISRO: ఇస్రో కష్టం ఈనాటిది కాదు.. ఈ 10 ఫోటోలు చూస్తే గూస్ బంప్స్ వస్తాయ్..

చంద్రయాన్-3 సక్సెస్ అయిన నేపథ్యంలో ఇస్రోకు సంబంధించిన ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇన్నాళ్ళు, ఇన్నేళ్లు భారతదేశ అంతరిక్ష పరిశోధనల గురించి ఎన్నో దేశాలు, ఎన్నో అంతర్జాతీయ దినపత్రికలు ఎగతాళి వ్యాఖ్యలు రాశాయి. భారతీయ శాస్త్రవేత్తలను చేతకానివారిగా పరిగణించాయి. కానీ ఇప్పుడు దేశం తన సత్తా చాటింది. అయితే ఈ విజయం ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. ఇస్రో కష్టం ఈనాటిది కాదు. దానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 10ఫోటోలే సాక్ష్యం. ఆ ఫోటోలేంటి? ఆ ఫోటోల వెనుక కథేంటి? తెలిస్తే ప్రతి భారతీయుడికి గూస్ బంప్స్ వస్తాయ్. ఇస్రోకు చెయ్యెత్తి సలాం కొట్టకుండా ఉండలేరు. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..

ప్రపంచంలోని ఇతర ప్రతిష్టాత్మక దేశాలతో పోలిస్తే అంతరిక్ష ప్రయోగాలు చేయడానికి భారత్ కు ఉన్న వనరులు చాలా తక్కువ. 1960లో స్వయానా ఇస్రో శాస్తవేత్త ఒకరు రాకెట్ లో ఒక భాగాన్ని సైకిల్ పైన మోస్తూ తీసుకెళుతున్న దృశ్యం(rocket part carrying on bicycle) ఆనాటి భారతదేశ వనరుల పరిస్థితిని స్పష్టం చేస్తోంది. అప్పట్లో భారతదేశానికి లభించిన సహాయం చాలా తక్కువ.

rocket.gif


1960లోనే తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచ్ స్టేషన్ లో విక్రమ్ సారాభాయ్(Vikram Sarabhai), హోమీ భాభా(Homi J. Bhabha) ఇద్దరు రాకెట్ ప్రయోగం గురించి చర్చిస్తున్న ఓ చిత్రం కూడా వైరల్ అవుతోంది. వీరిలో ఒకరు ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్( Father of the Indian space Program) బిరుదాంకితులు కాగా మరొకరు ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్father of the Indian nuclear program) గా పేరొందారు. వీరే భారతీయ పరిశోధనలకు బీజం వేసినవారు.

vs.gif

1960 సంవత్సరాలనికి చెందిన మరొక ఫోటోలో ఇస్రోకు చెందిన ఇద్దరు యువ శాస్త్రవేత్తలు తుంబా వద్ద టెస్ట్ రాకెట్ ను అసెంబ్లింగ్ చేస్తున్నారు. ఈ ఫోటోలో విశేషం ఏమిటంటే డాక్టర్ APJ అబ్దుల్ కలాం(Dr. APJ Abdul kalam) ఈ ఫోటోలోని ఒక యువ శాస్త్రవేత్త.

apj.gif

1960 సంవత్సరానికి చెందిన మరొక ఫోటోలో ఇస్రోలో విక్రమ్ సారాభాయ్ తో నాటి యువ శాస్త్రవేత్త APJ అబ్దుల్ కలాం రాకెట్ గురించి ఏదో చెబుతుండగా, విక్రమ్ సారాభాయ్ చాలా శ్రద్దగా వింటున్నారు.

apj2.gif


1969లో విక్రమ్ సారాభాయ్ ఇండియన్ స్పేస్ సెంటర్ ను ప్రారంభించారు.

isro3.gif

ఇక 1970లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు సమావేశం కాగా అందులో మన భారతదేశ శాస్త్రవేత్త దేవేంద్రలాల్(Devendra Lal) కూడా ఉన్నారు.

lal.gif

1979లో భారతదేశం తన రెండవ ఉపగ్రహం భాస్కర్(India second satellite) ను తయారుచేసింది.

bhaskar.gif

ఇస్రో కంట్రోల్ రూమ్ ఫోటో ఒకటి ఆసక్తిగా మారింది. ఈ ఫోటో చూస్తే అప్పట్లో ఇస్రో కంట్రోల్ రూమ్ పరిమాణం, అందులో వనరులు ఎన్నున్నాయనేది అర్థం అవుతుంది.

control.gif


1981లో చాలా ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. భారతదేశం తన మొట్టమొదటి కమ్యూనికేషన్ ఉపగ్రహం యాపిల్(communication satellite Apple) ను లాంచ్ చేసింది. లాంచింగ్ కు ముందు ఈ ఉపగ్రహాన్ని ఎద్దులబండిపై లాంచింగ్ స్టేషన్ కు మోసుకెళ్లారు. అప్పటి నుండి చాలా కాలం పాటు ఈ సందర్భాన్ని ఉదహరిస్తూ భారతదేశం మీద చాలా ఎగతాళిగా వార్తలు, కార్డూన్లు వెలువడ్డాయి.

apple.gif

1982లో యాపిల్ ఉపగ్రహాన్ని ట్రాక్ చేయడానికి ISRO ఉపయోగించిన నియంత్రణ కేంద్రం చూడచ్చు.

1981.gif

Updated Date - 2023-08-27T13:37:13+05:30 IST