Weird Laws: వామ్మో.. ఇవేం వింత చట్టాలు.. స్త్రీ, పురుషుల లోదుస్తులను కలిపి ఉతక్కూడదట.. భార్య బర్త్‌డేను మర్చిపోయిన భర్తకు శిక్ష ఏంటంటే..

ABN , First Publish Date - 2023-03-17T19:03:45+05:30 IST

మీకు మీ భార్య పుట్టిన రోజు గుర్తుందా? ప్రతి సంవత్సరం ఠంచనుగా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతారా? ఒకవేళ మీరు మీ భార్య బర్త్‌డే మర్చిపోతే ఆమె అలగవచ్చు లేదా గొడవ పెట్టుకోవచ్చు.

Weird Laws: వామ్మో.. ఇవేం వింత చట్టాలు.. స్త్రీ, పురుషుల లోదుస్తులను కలిపి ఉతక్కూడదట.. భార్య బర్త్‌డేను మర్చిపోయిన భర్తకు శిక్ష ఏంటంటే..

మీకు మీ భార్య పుట్టిన రోజు (Wife`s Birthday) గుర్తుందా? ప్రతి సంవత్సరం ఠంచనుగా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతారా? ఒకవేళ మీరు మీ భార్య బర్త్‌డే మర్చిపోతే ఆమె అలగవచ్చు లేదా గొడవ పెట్టుకోవచ్చు. అంతకు మించి పెద్ద ప్రమాదం ఉండదు. కానీ, సమోవా దేశస్థులు తమ భార్య పుట్టిన రోజును మర్చిపోవడం చట్ట ప్రకారం నేరం. మొదటి సారి మర్చిపోతే హెచ్చరికతో సరిపెడతారు. రెండోసారి కూడా మర్చిపోయిన వ్యక్తికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష లేదా భారీ జరిమానా పడుతుంది. ఇదెక్కడి చట్టంరా నాయనా అని ఆశ్చర్యపోతున్నారా? అలాంటి కొన్ని వింత రూల్స్ గురించి తెలుసుకుందాం (Strange Rules).

మీసం ఉన్న మగాడు ముద్దు పెట్టకూడదు..

స్వేచ్ఛ విషయంలో పెద్దగా ప్రతిబంధకాలు ఎదురవని అమెరికాలోని (America) ఓ ప్రాంతంలో ఓ వింత చట్టం అమల్లో ఉంది. నెవడాలోని యురేకా నగరంలో మీసం ఉన్న మగాడు.. ఏ మహిళకూ ముద్దు (Kiss) పెట్టకూడదు. అది చట్ట ప్రకారం నేరం. ఈ చట్టం కూడా చాలా పురాతన కాలం నాటిది.

లోదుస్తులను కలిపి ఉతక్కూడదు..

weird1.jpg

అమెరికాలోని మిన్నెసోటాలో ఒక విచిత్రమైన చట్టం అమలులో ఉంది. ఆ ప్రాంతంలో స్త్రీలు, పురుషుల లో దుస్తులను (Under Garments) ఒకే వాషింగ్ మెషీన్‌లో ఉతకకూడదు. అలాగే స్త్రీ, పురుషుల లో దుస్తులను పక్క పక్కనే ఆరబెట్టకూడదు. అలా చేయడం అక్కడ చట్టవిరుద్ధం. పురాతన కాలం నాటి ఈ చట్టం ఇప్పటికీ సాంకేతికంగా అమల్లో ఉంది.

రాత్రి పది తర్వాత నో ఫ్లష్

స్విట్జర్లాండ్‌లో రాత్రి 10 గంటల తర్వాత టాయిలెట్‌ని ఫ్లష్ చేయడం నేరం. స్విట్జర్లాండ్‌లో శబ్ద కాలుష్యం చాలా తక్కువగా ఉంటుంది. రాత్రి పది గంటల తర్వాత మరింత నిశబ్దంగా ఉండాలి. అలాంటి సమయంలో టాయ్‌లెట్ ఫ్లష్ చేయడం వల్ల కూడా చుట్టుపక్కల వారికి ఇబ్బంది పడతారాని భావిస్తారు. కాబట్టి రాత్రి 10 గంటల తర్వాత టాయిలెట్‌ను ఫ్లష్ చేయడంపై నిషేధం ఉంది. దీంతో చాలాసార్లు ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

లైటు మార్చకూడదు..

light.jpg

సాధారణంగా మీ ఇంట్లో లైటు పాడైపోయినప్పుడు, మీరు వెంటనే కొత్తది తెచ్చి వేసుకుంటారు. కానీ ఆస్ట్రేలియాలోని (Australia) విక్టోరియాలో అలా చేయడం చట్ట విరుద్ధం. మీరు మీ స్వంత ఇంటి లైట్లను మార్చుకోవడం నేరం. ఎలక్ట్రీషియన్ సర్టిఫికేట్ ఉన్న వ్యక్తి చేత మాత్రమే ఆ పనిని చేయించాలి.

పాపం.. సరదాగా అంటే సీరియస్‌గా తీసుకుంది.. ప్రియుడిని చంపేసి వెళ్లిపోయింది.. చివరకు.

Updated Date - 2023-03-17T19:08:03+05:30 IST