SuperStarKrishna: కృష్ణ, విజయనిర్మల ఫోటో వైరల్

ABN , First Publish Date - 2023-02-21T13:39:14+05:30 IST

కృష్ణ గారి కన్నా రెండేళ్ల ముందే విజయనిర్మల గారు కూడా పరమపదించారు (#SuperStarKrishnaGaru). కానీ వీరి జ్ఞాపకాలు సినిమాల, ఫోటోల రూపం లో అభిమానులకు ఎప్పుడూ కనపడుతూనే ఉంటాయి. అలాంటి ఒక ఫోటోనే ఈమధ్య ఒకటి వైరల్ అయింది

SuperStarKrishna: కృష్ణ, విజయనిర్మల ఫోటో వైరల్

కృష్ణ గారు (Krishna), విజయనిర్మల (Vijayanirmala) గారు భార్య భర్తలు, అలాగే వాళ్లిద్దరూ కలిపి ఎన్నో సినిమాల్లో నటించారు కూడా. విజయనిర్మల (Vijayanirmala) గారు దర్శకత్వం కూడా చేసారు చాలా సినిమాలకి, అందులో కృష్ణ (#SuperStarKrishnaGaru) గారు చాలా సినిమాలలో నటించారు కూడా. కృష్ణ గారు గత సంవత్సరం నవంబర్ 15న పరమపదించారు. అయన పోయినా అయన అభిమానులు ఆయనను గుర్తు చేసుకుంటూనే వున్నారు. ఎందుకంటే కృష్ణ గారికి వున్నన్ని అభిమాన సంఘాలు మరి ఏ ఇతర నటుడికీ కూడా లేవు అన్ని వందల అభిమాన సంఘాలు వున్నాయి.

కృష్ణ గారి కన్నా రెండేళ్ల ముందే విజయనిర్మల గారు కూడా పరమపదించారు (#SuperStarKrishnaGaru). కానీ వీరి జ్ఞాపకాలు సినిమాల, ఫోటోల రూపం లో అభిమానులకు ఎప్పుడూ కనపడుతూనే ఉంటాయి. అలాంటి ఒక ఫోటోనే ఈమధ్య ఒకటి వైరల్ అయింది. ఇందులో కృష్ణ గారు కుర్చీలో కూర్చుంటే, విజయ నిర్మల (#VijayaNirmala) గారు అతనికి ఎదో చూపిస్తూ వుంటారు. ఇది ఒక అరుదయిన ఫోటో, ఇది సాంఘీక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నట్టుగా తెలుస్తోంది.

krishna-vn.jpg

ఇది కృష్ణ గారు 'దేవదాసు' సినిమా చేస్తున్నప్పుడు తీసిన ఫోటో అని చెప్తున్నారు. నాగేశ్వర రావు గారు నటించిన 'దేవదాసు' తరువాత కృష్ణ గారు అదే కథని కలర్ లో చేద్దామని విజయనిర్మల దర్శకత్వం లో చేశారు. దేవదాసు గా కృష్ణ నటించగా ఆ సినిమాలో పార్వతిగా విజయనిర్మల నటించారు. ఈ సినిమాలో పాటలు పెద్ద హిట్, ఈరోజుకి కూడా చాలా బాగుంటాయి. ఈ సినిమా మొదటి సారి విడుదల అయినప్పుడు అంతగా ఆడలేదు కానీ, మళ్ళీ రెండోసారి విడుదల చేసినప్పుడు ప్రేక్షకులు బాగా ఆదరించారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-02-21T13:40:00+05:30 IST

News Hub