Lips Care Tips: మార్కెట్‌లో దొరికే లిప్‌బామ్‌లు కాదండోయ్.. రాత్రిపూట పడుకునేముందు పెదాలకు వీటిని రాసుకోండి చాలు..!

ABN , First Publish Date - 2023-04-11T21:36:33+05:30 IST

పెదవులను కాపాడుకోవడానికి మార్కెట్ లో దొరికే ఎన్నోరకాల లిప్ బామ్(lip balm) లు ఉపయోగిస్తుంటారు. కానీ పెద్దగా ఫలితం ఉండదు. అవన్నీ అక్కర్లేదు.. రాత్రిపూట ఇలా చేస్తే చాలు పెదవులు మృదువుగా.. తాజాగా.. చెర్రీ పళ్ళలా కనిపిస్తాయి.

Lips Care Tips: మార్కెట్‌లో దొరికే లిప్‌బామ్‌లు కాదండోయ్.. రాత్రిపూట పడుకునేముందు పెదాలకు వీటిని రాసుకోండి చాలు..!

అమ్మాయిల ముఖంలో చాలా వరకు ఆకర్షించేవి పెదవులు(lips). కవులు సైతం అధరాల అందాన్ని ఎంతో సుందరంగా అభివర్ణిస్తారు. ఎర్రగా, తాజాగా, చెర్రీ పళ్ళలా(cherry lips) తమ పెదవులు ఉండాలని ప్రతీ అమ్మాయి కోరుకుంటుంది. కానీ చలికాలంలో చలికి పగిలిపోవడం(lips cracking) ఒక బాధ అయితే.. వేసవిలో ఎండ ధాటికి కమిలిపోవడం(burning) మరొక బాధ. పెదవుల మీది చర్మం చాలా సున్నితంగా(sensitive skin) ఉండటం వల్ల వాతావరణ మార్పులకు చాలా తొందరగా ప్రభావానికి లోనవుతుంది. పెదవులను కాపాడుకోవడానికి మార్కెట్ లో దొరికే ఎన్నోరకాల లిప్ బామ్(lip balm) లు ఉపయోగిస్తుంటారు. కానీ పెద్దగా ఫలితం ఉండదు. అవన్నీ అక్కర్లేదు.. రాత్రిపూట ఇలా చేస్తే చాలు పెదవులు మృదువుగా.. తాజాగా.. చెర్రీ పళ్ళలా కనిపిస్తాయి. రాత్రి పడుకునేముందు పెదవులకు అప్లై చెయ్యాల్సినవేంటి? అవి ఎలా పనిచేస్తాయి? తెలుసుకుంటే..

తేనే.. (Honey)

శరీరానికి బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను కలిగించే తేనె తినడానికి మాత్రమే కాకుండా సౌందర్య ఉత్పత్తుల(honey in beauty products)లో కూడా ఉపయోగిస్తుంటారు. తేనెలో సహజంగానే తేమ ఉంటుంది. ఇందులో యాంటీ బాక్టీరియల్(Anti bacterial) లక్షణాలు ఉంటాయి. తేనె పగిలిన పెదవులను రిపేర్ చేసి సాధారణంగా మార్చడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ రాత్రి పడుకునేముందు పెదవులకు లిప్ బామ్ లాగా రాసుకోవాలి. ఇలా చేస్తుంటే పెదవుల పగుళ్లు పోవడమే కాదు పెదవుల నలుపు కూడా పోయి పెదవులు తాజాగా ఎర్రగా మారతాయి.

Yellow Teeth: పళ్లన్నీ ఇలా పచ్చగా మారిపోతున్నాయా..? ఏ మందులూ అక్కర్లేదు.. ఈ సింపుల్ టిప్స్‌తో దంతాలను తెల్లగా మారడం ఖాయం..!


పాలమీగడ..(Milk cream)

ప్రతి ఇంట్లో పాలు, పాలమీద మీగడ తప్పనిసరిగా ఉంటాయి. రాత్రి పడుకునే ముందు కాస్త పాలమీగడ పెదవులకు రాసుకోవాలి. ఇది గొప్ప మాశ్చరైజర్ లా పనిచేస్తుంది. పెదవులను మృదువుగా మారుస్తుంది.

కొబ్బరి నూనె..(Coconut oil)

మాశ్చరైజర్ల హవా లేని కాలంలో కొబ్బరినూనె చర్మసంరక్షణ కోసం ఉపయోగించేవారు. కొబ్బరి నూనె మృతచర్మాన్ని, మృతకణాలను తొలగించడంలో అద్బుతంగా సహాయపడుతుంది. పెదవులను తేమగా ఉంచుతుంది. రాత్రి పడుకునేముందు కొబ్బరినూనెతో పెదవులకు ఓ రెండునిమిషాలు మసాజ్ చేసుకుని ఆ తరువాత ఓ చుక్క కొబ్బరినూనె రాసుకోవాలి. ఇది అద్బుత ఫలితాన్ని ఇస్తుంది.

నెయ్యి..(ghee)

ఆవునెయ్యి అమృతంతో సమానమైనది. దీన్ని ఆహారపదార్థంగానూ, ఔషదాల తయారీలోనూ, వైద్య చికిత్సలలోనూ ఉపయోగిస్తారు. పగిలిన పెదవులమీద రాత్రి పడుకునే ముందు కాసింత నెయ్యి రాసుకోవాలి. పెదవులు సాధారణంగా మారిపోవడమే కాదు, మరింత అందంగా కూడా తయారవుతాయి.

Viral Photo: ఈ ఫొటోలోని పాప ఎవరో గుర్తు పట్టగలరా..? తండ్రి సినీ ఇండస్ట్రీని ఏళ్ల తరబడి ఏలుతున్న అగ్రహీరో..!


Updated Date - 2023-04-11T21:36:33+05:30 IST