Thalapathy67: విజయ్, లోకేశ్ సినిమాకు టైటిల్ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే..?

ABN , First Publish Date - 2023-02-03T17:26:00+05:30 IST

‘దళపతి 67’ ను సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. పాన్ ఇండియాగా రూపొందిస్తుంది. ఈ సినిమా టైటిల్ ఏంటీ అని ప్రేక్షకులందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ టైటిల్‌ను సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ ఓ ప్రోమో ద్వారా వెల్లడించింది.

Thalapathy67: విజయ్, లోకేశ్ సినిమాకు టైటిల్ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే..?

కోలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు ఇళయ దలపతి విజయ్ (Vijay). ప్రస్తుతం లోకేశ్ కనకరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో నటిస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. పాన్ ఇండియాగా రూపొందిస్తుంది. ఈ సినిమా టైటిల్ ఏంటీ అని ప్రేక్షకులందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ టైటిల్‌ను సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ ఓ ప్రోమో ద్వారా వెల్లడించింది. ‘లియో’ (Leo) అని సినిమాకు టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 19న విడుదల చేయనున్నట్టు మేకర్స్ తెలిపారు.

‘విక్రమ్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత లోకేశ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో మూవీ‌పై భారీ బజ్ ఉంది. సినిమా కూడా ఆ స్థాయిలోనే ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుంది. నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా మూవీ రూ.250కోట్లకు పైగా బిజినెస్ చేసింది. ఆడియో రైట్స్ రూ.16కోట్లు, శాటిలైట్ రైట్స్ రూ.80కోట్లు, ఓటీటీ రైట్స్ ద్వారా రూ.160కోట్లు వచ్చాయి. ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ (Trisha Krishnan) హీరోయిన్ పాత్రను పోషిస్తున్నారు. ప్రియా ఆనంద్, సంజయ్ దత్, గౌతమ్ మీనన్, యాక్షన్ కింగ్ అర్జున్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ చివరగా ‘వారిసు’ లో నటించారు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు. వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టింది.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-02-03T17:26:02+05:30 IST