Shocking: రైల్వే స్టేషన్‌లో అందరూ చూస్తుండగానే ప్రేమికుల రొమాన్స్.. చివరకు ఏం జరిగిందంటే..
ABN , First Publish Date - 2023-03-24T16:27:30+05:30 IST
రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న షాకింగ్ విషయాలు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం పాట్నా రైల్వే స్టేషన్‌లో టీవీ స్క్రీన్లపై మూడు నిమిషాల పాటు పోర్న్ క్లిప్ ప్లే చేసిన సంగతి తెలిసిందే.
రైల్వే స్టేషన్‌లో (Railway Station) జరుగుతున్న షాకింగ్ విషయాలు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం పాట్నా రైల్వే స్టేషన్‌లో టీవీ స్క్రీన్లపై మూడు నిమిషాల పాటు పోర్న్ క్లిప్ ప్లే చేసిన సంగతి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఇద్దరు యువతీ యువకులు మహారాష్ట్రలోని ఓ రైల్వే స్టేషన్‌లో బహిరంగంగానే రొమాన్స్ సాగించి అందరినీ షాక్‌కు గురిచేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.
మహారాష్ట్రలోని (Maharashtra) డోంబివిలి రైల్వే స్టేషన్‌లో ఓ జంట ప్లాట్‌ఫారమ్ అంచున నిలబడి ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నారు. అందరి ఎదుటా లిప్‌లాక్ చేసుకున్నారు. ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న ప్రజలను ఈ జంట పట్టించుకోలేదు. వారి పబ్లిక్ రొమాన్స్‌ను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా, ఆ జంటను చుట్టుపక్కల వారు వెంటనే హెచ్చరించారు. వారి చర్యపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ లోపు ఆ జంట అక్కడి నుంచి పరారైంది.
Viral: భర్తంటే ఇలా ఉండాలి.. తన భార్యను దోమలు కుడుతున్నాయంటూ ఫిర్యాదు.. వెంటనే స్పందించిన పోలీసులు ఏం చేశారంటే..
కాగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ జంటకు కొందరు మద్దతు పలకగా, మరికొందరు విమర్శలు చేశారు. వారిలో ఒకరు వేరే ప్రాంతానికి వెళ్లిపోతున్నారేమోనని, అందుకే చివరి వీడ్కోలుగా ముద్దు పెట్టుకుని ఉంటారని ఒక వ్యక్తి కామెంట్ చేశారు. కాగా, చిన్న పిల్లలు, పెద్దలు ఉన్న చోట ఇలాంటి సిగ్గుమాలిన చర్యకు దిగిన వారిని అరెస్ట్ చేయాలని మరొకరు అన్నారు.