Share News

Extra Income: సైడ్ సంపాదన కావాలా? కొత్త సంవత్సరంలో ఇలా చేయండి..!

ABN , Publish Date - Dec 25 , 2023 | 08:41 PM

వచ్చే ఏడాది నుంచీ ఇలా చేస్తే రెండు చేతులా సంపాదన పక్కా!

Extra Income: సైడ్ సంపాదన కావాలా? కొత్త సంవత్సరంలో ఇలా చేయండి..!

ఇంటర్నెట్ డెస్క్: ఖర్చులు పెరిగేవే కానీ తగ్గేవి కావు. కాబట్టి, ప్రతి మనిషికీ రెండో ఆదాయ మార్గం (Second Source of Income) తప్పనిసరి. అయితే, ఈ కాలంలో ఇలాంటి అవకాశాలు బోలెడన్నీ అందుబాటులో ఉన్నాయి. అందులో ముఖ్యమైనది గిగ్ ఎకానమీ (Gig Economy). ఓలా, ఊబెర్, స్వి్గ్గీ, జొమాటోతో పాటూ ఇతర అనేక యాప్‌లలో పనిచేసే వారందరూ ఈ కొత్త ఆర్థిక వ్యవస్థ పరిధిలోకి వస్తారు. కొందరికీ ఇదే ప్రధాన ఆదాయ వనరు కూడా. కాస్తంత వ్యూహాత్మకంగా నడుచుకుంటే రెండు చేతులా సంపాదించుకోవచ్చు. భవిష్యత్తును పదిలం చేసుకోవచ్చు. ఈ దిశగా నిపుణులు చెబుతున్న సలహాలేంటో ఓసారి పరిశీలిద్దాం.

గిగ్ ప్లాట్‌ఫామ్స్.. అంటే ఓలా (Ola), ఊబెర్ (Uber), స్విగ్గీ (Swiggy), అమెజాన్ (Amazon) లాంటివి పీక్ అవర్స్‌లో పనిచేసే డెలివరీ ఏజెంట్స్‌కు అదనపు మొత్తాలు చెల్లిస్తాయి. కాబట్టి.. బిజీ ప్రాంతాలు ఏవో తెలుసుకుని అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకుంటే ట్రిప్‌ల మధ్య గ్యాప్ తగ్గి ఉత్పాదకత, ఆదాయం రెండూ పెరుగుతాయి.


ప్రధాన యాప్‌ తోపాటూ మరో యాప్‌కు కూడా పనిచేయవచ్చు. రెండో ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు. ఇప్పటికే మార్కె్ట్లో చాలా మంది ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఉదాహరణకు మిల్క్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్‌ను ఎంచుకుంటే ఉదయం పూట ఆ ప్లాట్‌ఫామ్స్‌లో విధులు పూర్తి చేసుకుని మిగతా సమయాల్లో ప్రధాన యాప్‌‌కు చెందిన ట్రిప్స్ చూసుకోవచ్చు.

రిఫరెల్ అవకాశాలతో కూడా మంచి ఆదాయం పొందొచ్చు. ఉదాహరణకు మ్యాపింగ్ కంపెనీ కోసం ఆయా ప్రాంతాల్లోని నిర్మాణాలను సంస్థ ఇచ్చిన మ్యాప్‌లో మార్క్ చేసి కొంత మొత్తం పొందొచ్చు. సాధారణ ట్రిప్‌ల సమయంలో ఇలాంటి మ్యాపింగ్ పనికి కుదురుకుంటే అదనపు ఆదాయం పక్కా!

ఇక ఆఫీసులకు వెళ్లేవాళ్లు పార్ట్‌టైంగా ట్రాన్స్‌పోర్టు యాప్‌లకు సేవలందించి అదనపు ఆదాయం పొందొచ్చు. దీంతో, ట్రాఫిక్‌లో వృథాయ్యే సమయంలో ఆదాయం పొందినట్టు అవుతుంది.

నేటి జమానాలో నిరంతర విద్యార్థిగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు మార్కెట్ అవసరాలను గమనిస్తూ కొత్త కొత్త నైపుణ్యాలు అలవర్చుకుంటే సైడ్ ఇన్‌కం దండిగా వస్తుందని చెబుతున్నారు. అవకాశాలు అవే వెతుక్కుంటూ వస్తాయని గ్యారెంటీ ఇస్తున్నారు.

Updated Date - Dec 26 , 2023 | 08:02 AM