Viral: గుండెనొప్పి అంటూ ఛాతిపట్టుకుని పడిపోయిన కస్టమర్.. అంబులెన్స్ పిలవకుండా మొండికేసిన రెస్టారెంట్ సిబ్బంది.. పోలీసులు వచ్చి చూస్తే..
ABN , First Publish Date - 2023-10-19T16:07:40+05:30 IST
స్పెయిన్‌లోని రెస్టారెంట్లలో సుష్టుగా తిని గుండెనొప్పి నాటకం ఆడుతూ బిల్లు చెల్లించకుండా పారిపోతున్న ఓ వ్యక్తిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటివరకూ అతడు ఏకంగా 20 రెస్టారెంట్లను బురిడీ కొట్టించినట్టు గుర్తించారు.
ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా ఆపదలో ఉన్న వారికి సాయపడేందుకు వెంటనే రంగంలోకి దిగుతారు. కానీ, ఆ రెస్టారెంట్‌లో ఓ కస్టమర్ ఛాతిపట్టుకుని నేలపై పడి అంబులెన్స్ పిలవండని అభ్యర్థించినా వారు వినలేదు. చివరకు సీన్‌లోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చాకే అసలు విషయం బయటపడింది. ఆ కస్టమర్ గురించి అసలు విషయం తెలిసి చిర్రెత్తుకొచ్చిన పోలీసులు చివరకు అతడిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అంతేకాదు, అతడి విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ అన్ని రెస్టారెంట్లను అప్రమత్తంగా చేశాడు. అతడి ఫొటోను కూడా వారికి పంపించారు. ఏకంగా 20 మంది కస్టమర్లను బురిడీ కొట్టించిన అతడి తీరు స్థానికంగా పెద్ద చర్చకే(Viral) దారి తీసింది(Man Arrested In Spain For Faking Heart Attack In 20 Restaurants To Avoid Paying Bill). స్పెయిన్‌లో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే...
Viral: రోడ్డుపై అడ్డంగా పాము..దాని పడగకు తగిలేలా తూపాకీతో కాల్చిన వ్యక్తి.. గురి తప్పడంతో..
Viral: Viral: ఇలాంటి కోతి భూప్రపంచంలో మరోటి ఉండదేమో? తాసీల్దార్ ఆఫీసులోకి ఫైళ్లు కనిపించగానే..
నిందితుడు గత ఏడాది డిసెంబర్ నుంచి స్పెయిన్‌లోని బ్లాంకా ప్రాంతంలో నివసిస్తున్నాడు. రెస్టారెంట్లలో సుష్టుగా తిని బిల్లు ఎగ్గొట్టి వెళ్లిపోవడం అతడికి అలవాటుగా మారింది. ఒకటి కాదు. రెండు కాదు.. ఏకంగా 20 రెస్టారెంట్ వర్గాలకు అతడు టోపీ పెట్టాడు. అతడు పక్కాగా తన వ్యూహాన్ని అమలు చేయడంతో రెస్టారెంట్ వారికి అతడిని వదిలిపెట్టడం మినహా మరో మార్గం ఉండేది. తాజాగా అతడు ఇలాగే ట్రై చేసి అడ్డంగా బుక్కైపోయాడు. మొదట అతడు రెస్టారెంట్‌లో ఫుల్లుగా తిన్నాడు. బిల్లు చెల్లించేలోగానే అతడు అక్కడి జారుకునే ప్రయత్నంలో ఉండగా సిబ్బంది అడ్డుకుని డబ్బు కట్టమని పట్టుబట్టారు. దీంతో, అతడు వారికి ఏవో సాకులు చెప్పి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. బాత్రూమ్‌కు వెళ్లి వచ్చి బిల్లుకడతా అన్నాడు. ఆ తరువాత, తన వ్యాలెట్ హోటల్ గదిలోనే మర్చిపోయానని చెప్పుకొచ్చాడు. కానీ సిబ్బంది మాత్రం బిల్లు చెల్లించాల్సిందేనని పట్టుబట్టారు.
ఈ క్రమంలో అతడు చివరి అస్త్రంగా గుండెనొప్పి వస్తోందంటూ ఛాతి పట్టుకుని నేలపై కూలబడిపోయాడు. అంబులెన్స్ పిలవండంటూ గోలపెట్టాడు. కానీ, సిబ్బంది మాత్రం అతడి నాటకాలు గమనించి చివరకు పోలీసులను ఆశ్రయించారు. వారు వచ్చి అతడిని పాత నేరస్తుడిగా గుర్తుపట్టారు. అప్పటికే అతడు స్థానికంగా ఉన్న సుమారు 20 రెస్టారెంట్లలో గుండెపోటు నాటకం ఆడి బిల్లు చెల్లించకుండా పారిపోయినట్టు గుర్తించారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.