Phone Using: ఏమవుతుందిలే అని లైట్ తీసుకుంటున్నారా..? అసలు ఫోన్‌ను ఎక్కువ సేపు వాడితే ఎన్ని సమస్యలో తెలిస్తే..!
ABN , First Publish Date - 2023-09-28T16:14:54+05:30 IST
ఫోన్ లో ఎక్కువ సమయం గడపడం వల్ల ఇతరులతో ఇంటరాక్షన్ తగ్గుతుంది.
ఫోన్ ఇప్పటి వారికి నిత్య అవసర వస్తువు అయిపోయింది. ఫోన్ తో కాసేపు కూడా విడిగా ఉండలేని స్థితికి మనలో చాలామంది వచ్చేసారు. అయితే ఫోన్ ని ఎలావాడుతున్నాం.. లేదా అదే మనల్ని వాడేస్తుందా అసలు దీని గురించి ఆలోచించండి.
కంటి నొప్పి..
గంటల తరబడి ఫోన్ వైపు చూస్తూ ఉండటం వల్ల కంటి ఆరోగ్యంపై ప్రభావం పడి కంటి నొప్పి మొదలవుతుంది.
నిద్ర సమస్యలు
చాలా మంది రాత్రిపూట ఫోన్ చూస్తూ గడుపుతారు. అయితే ఇలా చేయడం పెద్ద తప్పు. ఈ ప్రభావం నిద్ర మీద పడి వెంటనే నిద్ర పట్టకపోవడం, నిద్ర రుగ్మతలకు దారి తీస్తుంది.
మెడ, వెనుక నొప్పి..
ఒక నిర్ధిష్ట పద్దతిలో ఒకే భంగిమలో కూర్టోవడం, పడుకోవడం ఎక్కువ సేపు ఫోన్ ని చూస్తూ ఉండటం వల్ల మెడ, వెన్నునొప్పి వస్తుంది.
ఒత్తిడి..
ఫోన్ ని ఎక్కువ సేపు చూడటం వల్ల చాలా మందిలో ఒత్తిడి ఆందోళన కలుగుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
వ్యాయామం లేకపోవడం..
ఫోన్ లో ఎక్కువ సమయం గడిపే చాలామంది ఉదయాన్నే లేచి వ్యాయామం చేయరు. ఇలాంటి జీవనశైలి ప్రమాదకరం.
ఇది కూడా చదవండి: దంతాలు పాడవకుండా ఉండేందుకు కూడా టిప్స్ ఏంటన్న డౌటా..? ఈ 7 ఆహార పదార్థాలేంటో తెలిస్తే..!
మెదడు ఆరోగ్యం..
దేనికైనా ఫోన్ పై ఆధారపడటం కూడా చేటునే తెస్తుంది. అలాగే ఫోనే చూడటం, వంటివి మెదడుకి చేడు ప్రభావం చూపుతుంది.
అంతర్గత
ఫోన్ లో ఎక్కువ సమయం గడపడం వల్ల ఇతరులతో ఇంటరాక్షన్ తగ్గుతుంది. ఇది వ్యక్తి అంతర్ముఖునిగా మారడానికి దారి తీస్తుంది.
ప్రమాదాలు..
ఒక్కోసారి గంటల తరబడి ఫోన్ చూడటం, దానితోనే సమయాన్ని గడపాలనుకోవడం చాలా ప్రమాదకం.ఎందుకంటే అందరి దృష్టి ఫోన్ పైనే ఉంటుంది.