New Tracking System: దొంగిలించబడిన లేదా పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల గుర్తించేందుకు త్వరలో కొత్త ట్రాకింగ్ సిస్టమ్

ABN , First Publish Date - 2023-05-14T14:49:15+05:30 IST

మీ సెల్‌ఫోన్ పోయిందా? లేదా దొంగిలించబడిందా? అయితే మీరు వెంటనే మీ సెల్‌ఫోన్ ఎక్కడుందో ట్రాక్ చేసే ట్రాకింగ్ సిస్టమ్ త్వరలో

New Tracking System: దొంగిలించబడిన లేదా పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల గుర్తించేందుకు త్వరలో కొత్త ట్రాకింగ్ సిస్టమ్

న్యూఢిల్లీ: మీ సెల్‌ఫోన్ పోయిందా? లేదా దొంగిలించబడిందా? అయితే మీరు వెంటనే మీ సెల్‌ఫోన్ ఎక్కడుందో ట్రాక్ చేసే ట్రాకింగ్ సిస్టమ్ త్వరలో అందుబాటులోకి వస్తోంది. ఈవారంలో సెల్‌ఫోన్ ట్రాకింగ్ సిస్టమ్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (CDoT) ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్‌(CDoT)కు చెందిన టెక్నాలజీ అభివృద్ధి విభాగం కొన్ని టెలికాం సర్కిల్‌లలో CEIR సిస్టమ్‌ను పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తోంది. తొలుత ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఈశాన్య భారతదేశంలోని ప్రాంతాల్లోని ఈ ప్రాజెక్టును అమలుకు ఈ వ్యవస్థ ఇప్పుడు సిద్ధంగా ఉందని CDoT అధికారి తెలిపారు. మే 17న పాన్-ఇండియా లాంచ్‌కు CEIR సిస్టమ్ సిద్ధమౌతోందన్నారు. త్వరాలో దేశవ్యాప్తంగా CEIR సిస్టమ్‌ను అమలు చేస్తామని CDoT చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ప్రాజెక్ట్ బోర్డ్ ఛైర్మన్ రాజ్‌కుమార్ ఉపాధ్యాయ తెలిపారు.

అన్ని టెలికాం నెట్‌వర్క్‌లలో మొబైల్ ఫోన్ల వినియోగాన్ని తనిఖీ చేయడానికి CDoT ఫీచర్లను జోడిస్తోంది. ఇందుకోసం IMEI నెంబర్ల బహిర్గతాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దేశంలో మొబైల్ పరికరాలను విక్రయించే ముందు 15 అంకెల ప్రత్యేక సంఖ్యను IMEIని గుర్తించడం జరుగుతుంది. ఆమోదించబడిన IMEI నెంబర్లు కలిగిన మొబైల్ ఫోన్లను ఏ నెట్‌వర్క్‌లో వినియోగించిన వెంటనే గుర్తించవచ్చు.

మొబైల్ ఫోన్ల IMEI నెంబరు, వాటిలో ఉపయోగి నెట్‌వర్క్‌ను టెలికం ఆపరేటర్లు, CEIR సిస్టమ్ విజిబులిటీ కలిగి వుంటాయి. CEIR ద్వారా పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్‌లను ట్రాక్ చేయడానికి కొన్నిరాష్ట్రాల్లో ఈ సమాచారం వినియోగించబడుతోంది. ఇటీవల కర్ణాటక పోలీసులు 2500 మొబైల్ ఫోన్లను CEIR సిస్టమ్ ద్వారా గుర్తించి, వాటి యజమానులకు అప్పగించారు.

ఇప్పటికే యాపిల్ ఫోన్లలో ఐడీ ద్వారా దొంగిలించబడిన లేదా పోగొట్టుకున్న సెల్‌ఫోన్లను గుర్తించే సిస్టమ్ ఉంది. కానీ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇలాంటి సౌకర్యం లేదు. CEIR సిస్టమ్‌ ఫోన్లో ఇన్‌బ్యుల్ట్ చేయబడి ఉంటుంది. దీని ద్వారా ఫోన్ల అక్రమ రవాణాను కూడా తనిఖీ చేయొచ్చు. అంతేకాదు ప్రభుత్వానికి రెవెన్యూ నష్టం వాటిల్లకుండా సాయపడుతుంది.

Updated Date - 2023-05-14T14:49:45+05:30 IST