Viral Video: మరీ ఇంత దారుణమా..? అంబులెన్స్‌కు డబ్బుల్లేక.. తాతయ్య మృతదేహాన్ని మనవడి బైక్‌పైనే కూర్చోబెట్టి..!
ABN , First Publish Date - 2023-11-27T20:54:33+05:30 IST
మార్పు తెచ్చామని, తెస్తామని ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు చెబుతున్నా వాస్తవ పరిస్థితులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయని రుజువు చేస్తున్న హృదయవిదారక వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: మార్పు తెచ్చామని, తెస్తామని ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు చెబుతున్నా వాస్తవ పరిస్థితులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయని రుజువు చేస్తున్న హృదయవిదారక వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా(Viral Video) మారింది. సొంత తాత మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి బైక్‌పై ఇంటికి తరలించాల్సిన దుస్థితి ఎదుర్కొన్న ఓ కుర్రాడిని చూసి నెటిజన్లు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Viral: చికెన్ శాండ్‌విచ్‌తో ఫ్లైట్ ఎక్కిన మహిళ..విమానంలో కునుకు తీయడంతో జరిగిందో దారుణం!
మధ్యప్రదేశ్ షాడోల్ జిల్లా ఆసుపత్రిలో ఇటీవల లులియా బైగా (56) అనే వ్యక్తి మరణించాడు. కొన్ని రోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన అతడు చికిత్స పొందుతూ కన్నుమూశాడు. కాగా లులియా మృతదేహాన్ని తీసుకెళ్లాలని ఆసుపత్రి సిబ్బంది ఆయన కుటుంబసభ్యులకు తెలిపారు. అయితే, లులియాను తరలించేందుకు శవవాహనం లేదా అంబులెన్స్ ఏర్పాటు చేయాలని వాళ్లు సిబ్బందిని అభ్యర్థించారు. ఇందుకు తొలుత సరేనన్న సిబ్బంది ఎంత సేపటికీ అంబులెన్స్ ఏర్పాటు చేయకపోవడంతో మరోదారి లేక లులియాను కుటుంబసభ్యులు బైక్‌పై ఇంటికి తీసుకెళ్లారు(MP Youth takes his grandpas dead body home on his bike ).
లులియా శవాన్ని అతడి కుటుంబసభ్యులు మనవడి బైక్‌పై కూర్చోపెట్టుకుని తరలిస్తుండగా అక్కడున్న కొందరు వీడియో తీశారు. దీన్ని నెట్టింట పంచుకోవడంతో ఒక్కసారిగా వైరల్‌గా మారింది. ఆసుపత్రిపై విమర్శలు వెల్లువెత్తాయి. కానీ ఆసుపత్రి వారు మాత్రం ఈ విషయంలో మౌనాన్నే ఆశ్రయించారు.
Viral: విసిగిపోయిన భారతీయ రెస్టారెంట్.. బ్రిటన్ ప్రజలకు ఊహించని వార్నింగ్!