Rohit Sharma: చాలా రోజుల తర్వాత ఐపీఎల్‌లో హాఫ్ సెంచరీ.. మ్యాచ్ గెలిచాక భార్యకు వీడియో కాల్ చేసి..

ABN , First Publish Date - 2023-04-12T10:18:07+05:30 IST

ఐపీఎల్‌లో ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ జట్టు తొలి విజయం సాధించింది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన ముంబై టీమ్ మంగళవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Rohit Sharma: చాలా రోజుల తర్వాత ఐపీఎల్‌లో హాఫ్ సెంచరీ.. మ్యాచ్ గెలిచాక భార్యకు వీడియో కాల్ చేసి..

ఐపీఎల్‌లో (IPL 2023) ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ (MI) జట్టు తొలి విజయం సాధించింది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన ముంబై టీమ్ మంగళవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో (DC) జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అంతేకాదు ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) చాలా కాలం తర్వాత హాఫ్ సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 173 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకు రోహిత్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్‌తో (Ishan Kishan) కలిసి తొలి వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

చాలా రోజుల తర్వాత ఐపీఎల్‌లో అర్ధ శతకం సాధించిన రోహిత్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ``ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్``గా నిలిచాడు. ఈ సీజన్‌‌లో తొలి విజయం లభించడంతోపాటు తను కూడా బాగా ఆడడంతో మ్యాచ్ అనంతరం రోహిత్ చాలా సంతోషంగా కనిపించాడు. మైదానంలో ఉండగానే తన భార్య రిషిక (Ritika Sajdeh)కు వీడియో కాల్ చేసి ఆమెతో తన సంతోషాన్ని పంచుకున్నాడు. కాగా, ఐపీఎల్‌లో ఎక్కువ ఇన్నింగ్స్‌‌ల (24) విరామం తర్వాత 50+ స్కోరు సాధించిన బ్యాటర్‌గా రోహిత్‌ (2021-2023) నిలిచాడు. అతడి తర్వాత మయాంక్‌ (21), మురళీ విజయ్‌ (20) ఉన్నారు.

David Warner: వార్నర్ ఇదేం బ్యాటింగ్? నెమ్మదిగా ఆడడంపై నెటిజన్ల విమర్శలు.. ఇర్ఫాన్ పఠాన్ ఏమన్నాడంటే..

మంగళవారం జరిగిన మ్యాచ్‌లో (MIvsDC) టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ వార్నర్ (51), అక్షర్ పటేల్ (54) అర్ధశతకాలతో రాణించడంతో 20 ఓవర్లలో 172 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన ముంబైకు ఓపెనర్లు మెరపు ఆరంభాన్ని అందించారు. మధ్యలో తడబడినా చివరకు ముంబై టీమ్ విజయం సాధించింది.

Updated Date - 2023-04-12T10:18:07+05:30 IST