Adipurush: ఆదిపురుష్ సినిమాపై కొత్త వివాదం..
ABN , First Publish Date - 2023-06-16T11:45:54+05:30 IST
హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాష్ (Prabhas) నటించిన పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్ (Adipurush). ఈ సినిమా ఇప్పుడు వివాదంలో పడింది.
హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాష్ (Prabhas) నటించిన పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్ (Adipurush). ఈ సినిమా ఇప్పుడు వివాదంలో పడింది. దర్శకుడు ఓం రౌత్ (OM Raut) తెరకెక్కించిన ఆదిపురుష్ సినిమాలో సీత (Sita) జన్మస్థలం (Birthplace) గురించి తప్పుగా చిత్రీకరించారని.. అది సరిదిద్దకపోతే రాజధాని భూభాగంలో ఏ భారతీయ సినిమాను ప్రదర్శించబోమని ఖట్మండ్ (Kathmandu) మెట్రోపాలిటన్ సిటీ మేయర్ ప్రకటించారు.
ఆదిపురుష్ సినిమాలో సీతాదేవి భారతదేశపు కుమార్తె అని డైలాగ్ చెబుతూ ఓ సన్నివేశం ఉంటుంది. దీనిపై నేపాల్ సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. నేపాల్ (Nepal) స్థానికుల నమ్మకం ప్రకారం సీతాదేవి నేపాల్‌లో జన్మించిందని, అందుకు విరుద్ధంగా ఇండియాలో సీతాదేవి జననం జరిగిందన్న డైలాగ్‌పై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ డైలాగ్ తొలగించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు.
ఆ డైలాగ్ తొలగిస్తేనే నేపాల్‌లో ఆదిపురుష్ సినిమా ప్రదర్శనకు అనుమతి ఇస్తామని నేపాల్ సెన్సార్ బోర్డు తేల్చి చెప్పింది. అంతవరకు ఆదిపురుష్ హిందీ సినిమా ప్రదర్శనకు అనుమతించేది లేదని స్పష్టం చేసింది.
కాగా గ్లోబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాఘవుడిగా.. కృతిసనన్ (Kriti Sanon) జానకిగా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలోకి వచ్చింది. మొదట్లో టీజర్ విడుదలైనప్పుడు విమర్శలను ఫేస్ చేసిన ఈ చిత్రం.. విడుదల సమయం దగ్గర పడే కొద్ది.. ఆకాశమే హద్దు అనేలా అంచనాలను క్రియేట్ చేసింది. ముఖ్యంగా ‘జైశ్రీరామ్’ (Jai Shri Ram) సాంగ్ విడుదలైన తర్వాత.. ఈ సినిమాపై ప్రేక్షకులు దృష్టి పెట్టడం మొదలెట్టారు. అలాగే తిరుపతి (Tirupati)లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుక, ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనలు ఈ సినిమాని వార్తలలో ఉంచుతూ వచ్చాయి.