Amazon Great Indian Festival: ఇది కదా బంపరాఫర్ అంటే.. స్మార్ట్ ఫోన్ కన్నా చీప్.. కేవలం రూ.12 వేలకే ల్యాప్‌టాప్..!

ABN , First Publish Date - 2023-09-29T16:41:07+05:30 IST

అక్టోబర్ 8వ తేదీ నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభం కాబోతోంది. ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వివిధ వస్తువులపై బంపరాఫర్లను ప్రకటించింది. కొన్ని వస్తువులపై ఇప్పటికే ఆఫర్లను ప్రకటించింది. మొబైల్స్, టీవీలు, ల్యాప్‌టాప్‌లపై మెగా డిస్కౌంట్లను అందిస్తోంది.

Amazon Great Indian Festival: ఇది కదా బంపరాఫర్ అంటే.. స్మార్ట్ ఫోన్ కన్నా చీప్.. కేవలం రూ.12 వేలకే ల్యాప్‌టాప్..!

అక్టోబర్ 8వ తేదీ (October 8) నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Indian Festival Sale) ప్రారంభం కాబోతోంది. ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వివిధ వస్తువులపై బంపరాఫర్లను ప్రకటించింది. కొన్ని వస్తువులపై ఇప్పటికే ఆఫర్లను ప్రకటించింది. మొబైల్స్, టీవీలు, ల్యాప్‌టాప్‌లపై మెగా డిస్కౌంట్లను (Discounts on Laptops) అందిస్తోంది. అన్నింట్లోకి ల్యాప్‌టాప్‌పై ప్రకటించిన డిస్కౌంట్ చాలా మందిని ఆకట్టుకుంటోంది. దాదాపు 50 శాతం డిస్కౌంట్‌తో ఆ ల్యాప్‌టాప్ డీల్ చాలా మందిని ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం విక్రయ ధరకు కొనుగోలు చేయడం ద్వారా వేల రూపాయలు ఆదా చేసుకోవచ్చు. ల్యాప్‌టాప్‌లపై లభించే డిస్కౌంట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

AXL VayuBook ల్యాప్‌టాప్: 14.1 అంగుళాల FHD IPS డిస్ప్లే‌తో వచ్చే ఈ ల్యాప్‌టాప్ 4GB RAM ఉన్న ఈ ల్యాప్‌టాప్ 128GB స్టోరేజ్‌‌తో అందుబాటులో ఉంది. విండోస్ 11 ఓఎస్‌తో నడిచే ఈ ల్యాప్‌టాప్ ఆన్‌లైన్ సర్ఫింగ్, ఆన్‌లైన్ స్టడీకి బాగా ఉపయోగపడుతుంది. ఈ ల్యాప్‌టాప్‌పై అమెజాన్ ఏకంగా 59% తగ్గింపు ఆఫర్ చేస్తోంది. స్మార్ట్‌ఫోన్ కంటే చౌకగా కేవలం రూ. 12,989కే ఈ ల్యాప్‌టాప్‌ను స్వంతం చేసుకోవచ్చు.

Viral News: గుక్కపట్టి ఏడుస్తున్న ఓ పాప.. రోడ్డు పక్కన వెళ్తున్న వారికి డౌట్.. స్కూల్‌లోకి వచ్చి చూస్తే షాకింగ్ సీన్..!

Lenovo V15 ITL ల్యాప్‌టాప్: 15.6 అంగుళాల ఫుల్ హెచ్‌డి స్క్రీన్‌తో కూడిన ఈ లెనోవో ల్యాప్‌టాప్‌పై ఒక సంవత్సరం వారంటీ కూడా ఉంది. విండోస్ 11 ఓఎస్‌తో నడిచే ఈ ల్యాప్‌టాప్‌లో ఇంటెల్ కోర్ i3 ప్రాసెసర్ ఉంది. ఈ ల్యాప్‌టాప్‌లో భారీ సాఫ్ట్‌వేర్‌ను కూడా రన్ చేసుకోవచ్చు. ఈ ల్యాప్‌టాప్ 45 శాతం వరకు తగ్గింపుతో ఈ సేల్‌లో అందుబాటులోకి రానుంది.

Acer Swift Go 14: ఫుల్ హెచ్‌డి స్క్రీన్‌తో వస్తున్న ఈ ఏసర్ ల్యాప్‌టాప్‌ విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుంది. 14 అంగుళాల స్క్రీన్‌, 512 GB స్టోరేజ్‌కలిగిన ఈ ల్యాప్‌టాప్‌పై ఆమెజన్ 38శాతం వరకు తగ్గింపును ఆఫర్ చేస్తోంది.

MSI మోడ్రన్ 14, ఇంటెల్ 12వ జెన్: గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ఈ ల్యాప్‌టాప్ కూడా చాలా మందిని ఆకట్టుకుంటోంది. తక్కువ బరువు, డిజైన్‌లో చాలా సన్నగా ఉండే ఈ ల్యాప్‌టాప్ బ్యాటరీ చాలా కాలం పాటు పనిచేస్తుంది. 60 Hz రిఫ్రెష్ రేట్‌, Windows 11తో కూడిన ఈ ల్యాప్‌టాప్‌ను అమెజాన్ కిక్‌స్టార్టర్ డీల్‌లో 37% తగ్గింపు ఆఫర్‌తో కొనుగోలు చేయవచ్చు.

Updated Date - 2023-09-29T16:41:07+05:30 IST