Niharika Konidela: తాజా ఫోటోస్ వైరల్

ABN , First Publish Date - 2023-02-15T14:46:56+05:30 IST

చురుకుగా వుండే నిహారిక ఇప్పుడు బయటికి వచ్చింది, అయితే సినిమా షూటింగ్ కి మాత్రం కాదండోయ్! ఒక బంగారం షాపు ప్రచారానికి గాను ఆమె బయటకి వచ్చింది. అదే ప్రచారం లో ఇంకో నటి 'డీజే టిల్లు' (DJ Tillu) ఫేమ్ నేహా శెట్టి (Neha Shetty) కూడా వచ్చింది.

Niharika Konidela: తాజా ఫోటోస్ వైరల్
Niharika promoting a Jewellery shop in city.

నిహారిక కొణిదెల (Niharika Konidela) సాంఘీక మాధ్యమాల్లో చాలా చురుకుగా ఉంటూ ఉంటుంది. ప్రస్తుతం చేతిలో సినిమాలు ఏమి లేకపోయినా, నిహారిక తన సాంఘీక మాధ్యమాల్లో తన గురించి షేర్ చేస్తూ ఉంటుంది.

niha2.jpg

చురుకుగా వుండే నిహారిక ఇప్పుడు బయటికి వచ్చింది, అయితే సినిమా షూటింగ్ కి మాత్రం కాదండోయ్! ఒక బంగారం షాపు ప్రచారానికి గాను ఆమె బయటకి వచ్చింది. అదే ప్రచారం లో ఇంకో నటి 'డీజే టిల్లు' (DJ Tillu) ఫేమ్ నేహా శెట్టి (Neha Shetty) కూడా వచ్చింది.

niha5.jpg

ఈ ప్రచారానికి వచ్చిన నిహారిక ఫొటోస్ ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. ఆమె బంగారు నగలు పెట్టుకొని, నవ్వుతూ వున్న ఫోటోస్ సాంఘీక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

niha3.jpg

సినిమాల్లో నటించటం లేదు కానీ, నిహారిక ఇప్పుడు వెబ్ సిరీస్ లను నిర్మిస్తోంది. ఆమె నిర్మాతగా వ్యవహరించిన 'హలో వరల్డ్' ఆమధ్య జీ5 లో ప్రసారం అయింది. దానికి ముందు 'ఒక చిన్న ఫామిలీ స్టోరీ' ని కూడా ఆమె నిర్మాతగా వ్యవహరించింది. అయితే మరి సినిమాలు ఎందుకు మానేసిందో మాత్రం చెప్పలేదు. మంచి ఆఫర్స్ వస్తే చేస్తుంది అని మాత్రం అంటున్నారు.

niha1.jpg

నిహారిక తండ్రి నాగబాబు (Nagababu) రాజకీయాల్లో చాలా బిజీగా వున్నారు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాజకీయ 'జనసేన' (Janasena Party) పార్టీకి నాగబాబు తెర వెనక చాలా పనిచేస్తూ వుంటారు. అప్పుడప్పుడూ ఆక్టివ్ గా కూడా ఉంటూ తమ్ముడితో పాటు సభల్లో పాల్గొంటూ వుంటారు.

Updated Date - 2023-02-15T14:46:57+05:30 IST